తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ 7PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News Today
Telangana Top News Today

By

Published : Jan 2, 2023, 6:59 PM IST

  • సీఎం ఇంటికి సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్​ ఇంటికి సమీపంలో బాంబు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.

  • దిల్లీ లిక్కర్ స్కామ్.. నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

దిల్లీ లిక్కర్ స్కాం కేసులోని నలుగురు నిందితులకు రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. ఈడీ విజ్ఞుప్తి మేరకు.. నిందితులకు ఈనెల 7 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.

  • 'అది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు'

న్యాయ సహాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొత్తగా 23 న్యాయసేవాధికార సంస్థలను జస్టిస్ ఉజ్జల్​ భూయాన్​ వర్చువల్​గా ప్రారంభించారు.

  • తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!

మహిళలు, చిన్నారుల భద్రత లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. లైంగిక నేరాలు, వేధింపుల కట్టడికి షీ టీమ్‌లు, భరోసా కేంద్రాలను పటిష్ఠం చేస్తోంది. ఆన్‌లైన్ వేధింపుల బారిన పడకుండా అధికారులు యువతులకు అవగాహన కల్పిస్తున్నారు.

  • 'ఆత్మహత్మకు ప్రయత్నించాడు.... రెండు కాళ్లు పొగొట్టుకున్నాడు'

ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలకు కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాంటి వారు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక యవకుడు ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాలు మీదకి వెళ్లాడు.

  • 'ఉక్రెయిన్​తో రష్యా వ్యవహరించినట్టుగా.. భారత్​తో చైనా వైఖరి'

ఉక్రెయిన్​తో రష్యా వ్యవహరించిన విధంగానే.. భారత్​తో చైనా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. దేశంలోని పరిస్థితుల్ని ఆసరాగా తీసుకొని చైనా.. సరిహద్దు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. సినీనటుడు, రాజకీయ నాయకుడు కమల్​ హాసన్​తో జరిపిన సంభాషణలో ఈ విషయాలను చర్చించారు.

  • పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాల ప్రయాణం..

ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం రాత్రి ఓ బైక్​ రైడర్​ అతి దారుణంగా మృతి చెందాడు. చాలా వాహనాలు రాత్రంతా అతని మృతదేహం పైనుంచి ప్రయాణించాయి. దీంతో శరీర భాగాలు నలిగి రోడ్డంతా చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకొన్న పోలీసులు సోమవారం గడ్డపార సహాయంతో వాటిని సేకరించారు.

  • భారీగా పెరిగిన నిరుద్యోగం..

దేశంలో నిరుద్యోగం మరింత పెరిగిందని వెల్లడైంది. హరియాణాలో ఈ సమస్య అత్యధికంగా ఉందని తెలిసింది.

  • మిషన్ 2024 టార్గెట్​​.. లంకతో భారత్​ ఢీ.. పాండ్య సేన బోణీ కొడుతుందా?

రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్​ కోసం క్రికెట్​ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..

  • రష్యాలోనూ 'తగ్గేదేలే'.. దూసుకెళ్తున్న కలెక్షన్స్‌

ఇటీవలే రష్యాలో విడుదలైన అల్లుఅర్జున్​ 'పుష్ప' అక్కడ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత కలెక్ట్​ చేసిందంటే?

ABOUT THE AUTHOR

...view details