తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2023, 4:58 PM IST

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News Today
Telangana Top News Today

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు... సిట్ మెమో కొట్టివేతకు హైకోర్టు సమర్థన

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ మెమోను కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీఎల్‌ సంతోష్, తుషార్, శ్రీనివాస్‌ను నిందితులుగా గతంలో సిట్‌ మెమో దాఖలు చేసింది. ముగ్గురిని నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు ఇటీవల కొట్టివేసింది.

  • 'త్వరలోనే అందుబాటులోకి 1000 పడకల ఆస్పత్రి'

ఒక ఊరులో 100 పడకల ఆస్పత్రి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ చుట్టు పక్కల ఉండే ప్రజలందరికి వైద్య సదుపాయాలు అందుతాయి. అలాంటిది 1000 పడకల ఆస్పత్రిని సిద్దిపేట జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నారు. దానిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

  • బండి 6వ విడత పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్​సిగ్నల్

గత ప్రజా సంగ్రామ యాత్రలు విజయవంతమైన అయిన నేపథ్యంలో.. ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ అధిస్ఠానం ఓకే చెప్పింది. ఈనెల 18 నుంచి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  • అయ్యప్పస్వామిపై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు..

అయ్యప్పస్వామిపై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్టు బైరి నరేశ్​ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.నిందితుడుపై గతంలోనూ కేసులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కొడంగల్ పోలీసులు రిమాండ్​ రిపోర్ట్​ను కోర్టుకు సమర్పించారు.

  • 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్దమా'..

మద్యం అమ్మకాలపైనే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆధారపడిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​ ఆరోపించారు. ఆర్థిక శాఖపై కనీసం సమీక్షలు సైతం నిర్వహించలేని దుస్థితి.. రాష్ట్రంలో నెలకొందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్​రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్​ విసిరారు.

  • బీజేపీ సీనియర్​ నేత పీవీ చలపతిరావు కన్నుమూత

బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలందించిన.. సీనియర్ నేత పొక్కల వెంకట చలపతిరావు కన్నుమూశారు. ఆయన.. పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని పార్టీ ప్రముఖులు కొనియాడారు. చలపతిరావు మృతి పట్ల వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • యువతిని ఢీకొట్టి 20 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు..

కొత్త సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. సుల్తాన్‌పురిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 18 నుంచి 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. యూటర్న్‌లు కూడా కొట్టింది.

  • కాలేజ్​లో యువతి దారుణ హత్య..

బెంగళూరులోని ఓ కాలేజ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

  • మిషన్ 2024 టార్గెట్​​.. లంకతో భారత్​ ఢీ..

రేపు జరగబోయే భారత్, శ్రీలంక టెస్టు మ్యాచ్​ కోసం క్రికెట్​ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సారి సీనియర్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్​లో ఏలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఆ వివరాలు..

  • ఆడియెన్స్​కు బంపర్ ఆఫర్​.. ఆ సినిమా చూస్తే లక్ష రూపాయలు..

ఓ మూవీటీమ్​ బంపర్​ ఆఫర్​ను ప్రకటించింది. తమ సినిమాను థియేటర్​కు వెళ్లి చూస్తే లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. దీనికి ఓ కండిషన్ పెట్టింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details