తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్@ 3PM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News Today
Telangana Top News Today

By

Published : Jan 2, 2023, 3:02 PM IST

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్ మెమోను కొట్టివేయడాన్ని సమర్థించిన హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్​ మెమోను కొట్టివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. బీఎల్​ సంతోష్​, తుషార్​, శ్రీనివాస్​ను నిందితులుగా చేర్చడాన్ని అ.ని.శా కోర్టు తోసిపుచ్చింది.

  • సిర్పూర్కర్ నివేదికను త్వరగా అమలు చేయాలి: హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను త్వరగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అదే విధంగా ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

  • సర్పంచుల నిధుల సమస్యపై కాంగ్రెస్ పోరు.. రేవంత్ రెడ్డి అరెస్టు

ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పంచాయతీలకు నిధుల సమస్యపై నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్‌ నేతల్ని అడ్డుకోవడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

  • ఉద్యానసాగుతో లాభాలు గడిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి శ్రీకాంత్‌రెడ్డి

ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడే ఆదర్శ రైతుగా గుర్తింపు పొందాలనేది ఆయన కల. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపకుండా సీతాఫలం తోటను సాగుచేశారు. మంచి లాభాలను గడిస్తున్నారు.

  • నాన్న దిద్దిన ఛాంపియన్​: కుమారుడిని ఒలింపియన్​గా చూసేందుకు తానే కోచ్​గా మారి..!

కష్టం, పట్టుదల, అంకితభావం ఉంటే మంచి క్రీడాకారుడు కావొచ్చు. క్రమశిక్షణ, త్యాగాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైతే ఛాంపియన్‌ అవ్వొచ్చు. కానీ ఎలాంటి ఆర్భాటం.. ప్రచారం లేకుండా ఒక్కసారిగా అండర్‌-14 బాలుర సింగిల్స్‌లో జాతీయ నంబర్‌వన్‌గా నిలిచిన సామల శౌర్యది కాస్త భిన్నమైన కథ.

  • పెన్షన్ సొమ్ములో దొంగ నోట్ల ఘటన.. మార్చింది ఎవరో తెలుసా!

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పింఛన్ల సొమ్ములో దొంగనోట్ల ఘటనలో వాలంటీరే నిందితుడని తేలింది. నిన్న ప్రకాశం జిల్లాలో వాలంటీర్లు పంపిణీ చేసిన పింఛన్ల డబ్బులో దొంగ నోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఎంపీడీవో సుబ్బారాయుడు కీలక సమాచారాన్ని బయటపెట్టాడు.

  • రెండు నెలల చిన్నారిపై తల్లి దారుణం..

రెండు నెలల చిన్నారిని ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందకు పడేసింది ఆమె తల్లి. ఈ హృదయవిదారక ఘటన గుజరాత్​లో వెలుగుచూసింది. పుట్టినప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల ఇలా చేశానని నిందితురాలు పోలీసుల విచారణలో చెప్పింది.

  • ఆకాశ్ అంబానీ ఫేక్​ ఐడీతో ఆమెకు వల..

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీతో ఓ మహిళను మోసం చేసి రూ.25 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన గుజరాత్​లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • 'అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు కోహ్లీ చెప్పిందే ఫాలో అవుతున్నారు'..

ఒకప్పుడు టీమ్ఇండియా విషయంలో విరాట్​ కోహ్లీ చెప్పిన సూచనల్ని పట్టించుకోలేదు బీసీసీఐ. అయితే, ఇప్పుడు అతడి సూచనలనే పాటిస్తోంది. వన్డే వరల్డ్​ కప్​నకు 20 మందిని ఎంపిక చేసిన క్రికెట్​ బోర్డు.. కోహ్లీ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటోంది.

  • సమంత ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్..

'శాకుంతలం' మూవీ అప్డేట్స్​ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు తీపి కబురు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details