తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Jan 2, 2023, 1:00 PM IST

  • 'పెద్ద నోట్ల రద్దు సరైనదే'..

మోదీ సర్కారుకు ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్​బీఐని సంప్రదించిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నందున.. ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

  • వైద్య విద్యకు శ్రీకారం: ప్రవేశాలు పూర్తి..

వనపర్తిలో వైద్య విద్యకు రంగం సిద్ధమైంది. వైద్య కళాశాలకు తుది రూపం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అనుబంధంగా జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. ప్రభుత్వం కేటాయించిన 150 సీట్లను భర్తీ చేయడానికి కళాశాల నిర్వాహకులు విడతల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రేపటి నుంచి వైద్య విద్యా బోధన ప్రారంభం కానుంది.

  • సర్పంచుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఎంపీ ఉత్తమ్‌

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి, గ్రామ సర్పంచులపై వ్యవహరిస్తోన్న తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

  • ఆదర్శం: నాడు చేపలు అమ్మిన చేతులతోనే నేడు రూ.కోట్లలో వ్యాపారం..

ఇంట్లో, బంధువుల్లో.. ‘ఆడపిల్ల’న్న చిన్నచూపు! ఆ వివక్షే.. నాడు చేపలు అమ్ముతూ అమ్మకు సాయం చేస్తున్న ఆ అమ్మాయి మనసులో వ్యాపారవేత్త కావాలన్న ఆలోచనకు బీజం వేసింది. ఆ కల నెరవేరి నేడు మసాలాలు అమ్ముతూ కోట్లలో వ్యాపారం చేస్తోంది. ఈ స్ఫూర్తిగాథ వినోదా చందావత్‌ది. తన జీవితంలో ఎదురైన సవాళ్లను ఆమె 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు.

  • ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి చొరవ.. అవయవదానం చేసేందుకు ముందుకొచ్చిన 250 మంది..

మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. అదే అవయవ దానం చేస్తే మరణించినా వేరొకరికి జీవితాన్ని ఇవ్వవచ్చు. మరో ఎనిమిది మంది బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన జయచంద్రారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు.

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకలి కేకలు: చికిత్స ఉచితం.. ఆహారం మాత్రం..!

ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలు, మండలాల్లో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని పలువురు రోగులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే.. చికిత్స ఉచితమైనా ఆహార ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • నెలన్నర నుంచి ఒకేచోట ఉంటున్న నాగుపాము..

మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో నెలన్నర నుంచి నివాసముంటున్న ఓ నాగుపాము అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలో జరిగింది. దీంతో రోజూ అధిక సంఖ్యలో ప్రజలు ఆ పామును చూసేందుకు తరలివస్తున్నారు.

  • జైలుపై ముష్కరుల దాడి..

మెక్సికోలోని ఓ జైలులో కాల్పులు కలకలం సృష్టించాయి. ముష్కరులు జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.

  • చెస్ పోటీల్లో దేశానికి మరిన్ని పతకాలు తెస్తానంటున్న కోనేరు హంపి..

కజకిస్థాన్​లో జరిగిన ప్రపంచ రాపిడ్​, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ పోటిల్లో విజయవాడకు చెందిన తెలుగమ్మాయి ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తా చాటింది. మహిళల విభాగంలో తొలిసారిగా భారత్​కు వెండి పతకాన్ని సాధించి పెట్టింది. క్లిష్టమైన ఈ ఆటలో తాను విజయం సాధించేందుకు ఎంతో కష్టపడినట్లుగా తెలిపింది.

  • అత్యధిక కలెక్షన్స్​ రాబట్టిన పవర్​ స్టార్​ మూవీస్​..

తెలుగు సినీ చరిత్ర పుస్తకంలో పవన్ కల్యాణ్​ పేజీ అదోరకం. పూర్తిగా వర్ణించడం సాధ్యం కానిది. అందరికీ ఆమూలాగ్రం అర్థం కానిది. కేవలం 10 లోపు చిత్రాలతోనే అగ్రహీరోగా ఎదిగిన వాడు పవర్ స్టార్​గా బాక్సాఫీస్​ను శాసిస్తున్న వాడు పవన్.

ABOUT THE AUTHOR

...view details