తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ @7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Jan 2, 2023, 7:02 AM IST

  • తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

  • ఏపీలో బీఆర్​ఎస్ విస్తరణపై కేసీఆర్‌ దృష్టి.. నేడు పలువురు నేతల చేరిక..

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై గులాబీ దళపతి కేసీఆర్ దృష్టి సారించారు. వివిధ పార్టీల నుంచి ఏపీకి చెందిన పలువురు విశ్రాంత అధికారులు ఇవాళ బీఆర్​ఎస్​లో చేరనున్నారు. జనసేన నుంచి విశ్రాంత ఐఏఎస్ తోట చంద్రశేఖర్, విశ్రాంత ఐఆర్ఎస్ పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

  • న్యూఇయర్​ జోష్​.. కొత్త రికార్డులు సృష్టించిన మద్యం విక్రయాలు

రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆరు రోజుల్లో రూ.11 వందల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు.

  • చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అపశ్రుతి

ఏపీలోని గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు సభ ముగిసి ఆయన వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది.

  • 'ఓబీసీ జడ్జిల సంఖ్య 15 శాతమే.. కొలీజియంతో సామాజిక న్యాయం జరగట్లేదు'

కొలీజియం నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో ఓబీసీలు కేవలం 15 శాతం మాత్రమే ఉన్నారని తెలిపింది.

  • చైనా ప్రయత్నాలు ఫలించవు: దలైలామా

చైనాపై బౌద్ధమత గురువు దలైలామా కీలక వాఖ్యలు చేశారు. చైనా.. బౌద్ధమతాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందన్నారు. అందుకు చైనా చేసే యత్నాలు ఫలించవని ఆయన పేర్కొన్నారు.

  • అద్దె చెల్లించని ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్‌పై దావా.. భవనం ఖాళీ చేయాలని నోటీసులు

ఇటీవలే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన.. ట్విటర్‌ ప్రధాన కార్యాలయం అద్దెను కొంతకాలంగా చెల్లించడం లేదట. దీంతో భవన యాజమాన్య సంస్థ కోర్టులో దావా వేసింది.

  • రైలు ప్రయాణం.. రూ.10 లక్షల బీమా.. ఈ విషయాలు తెలుసుకోండి మరి!

రైలు ప్రయాణం చేసేవారికి రూ.10 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అదెలా అంటే?

  • 'ఓపెనర్​గా రాహుల్​ వద్దు.. ఇషాన్​ కిషన్​కు అవకాశమివ్వండి'.. గంభీర్​ సలహా

టీమ్ఇండియా ఆటగాడు కేఎల్​ రాహుల్​పై మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంబీర్​ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఓపెనర్​గా ఆడించడాన్ని తప్పుబట్టాడు. అతడి ప్లేస్​లో మరో యువ క్రికెటర్​ను ఆడించాలని సూచించాడు. ఇంకా ఏమన్నాడంటే..

  • 'అన్నా ఎందుకిలా చేశావు?'.. విజయ్‌ దేవరకొండ పోస్ట్​పై నెటిజన్ల రిప్లై!

నూతన సంవత్సరం సందర్భంగా సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

ABOUT THE AUTHOR

...view details