తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News Today
Telangana Top News Today

By

Published : Jan 1, 2023, 9:00 PM IST

  • ' విశ్వనగరంగా మార్చడమే లక్ష్యం'

రాష్ట్రానికి కల్పతరువు లాంటి హైదరాబాద్‌ను సంరక్షించుకుంటూ.. విశ్వనగరంగా మార్చే లక్ష్యంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గచ్చిబౌలిలోని కొత్తగూడ నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు.

  • భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

New Year Celebrations in Telangana : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు.

  • కొత్తగా 'మన బడి'..

రాష్ట్రంలో 'మన ఊరు-మన బడి' మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,210 బడులు కొత్త అందాలను సంతరించుకున్నాయి.

  • రికార్డులు సృష్టించిన మద్యం విక్రయాలు

రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆరు రోజుల్లో రూ.11 వందల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. డిసెంబర్‌ నెలలో ఏకంగా రూ.3,376 కోట్లు విలువైన మద్యాన్ని మద్యం ప్రియులు తాగేశారు.

  • 'పోలీస్' అభ్యర్థులకు బిగ్​ అలర్ట్​..

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్​పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది.

  • సుప్రీంలో 58 పిటిషన్లు​ సోమవారమే తీర్పు

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది.

  • 'భీమా కోరెగావ్'లో వేడుకలు..

రెండేళ్ల నిషేధం తర్వాత జరిగిన భీమా కోరెగావ్ యుద్ధ వార్షికోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. యుద్ధస్మారక చిహ్నం వద్ద ప్రార్థనలు నిర్వహించారు.

  • వంట గ్యాస్ ధర పెంపు..

వంట గ్యాస్​ ధర మరోసారి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,769కి చేరింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్​ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

  • 'పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​కు సన్మానం'

క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. మరోవైపు, వీఐపీలు పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని డీడీసీఏ అభ్యర్థించింది.

  • చిరు న్యూఇయర్​ సర్​ప్రైజ్​..

'వాల్తేరు వీరయ్య' సినిమాలోని మరో పాట త్వరలో విడుదల కానుంది. న్యూఇయర్ సందర్భంగా ఆ సాంగ్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో చిరంజీవి రిలీజ్​ చేశారు. మీరూ ఓ సారి చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details