తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ @5PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News  Today
Telangana Top News Today

By

Published : Jan 1, 2023, 4:59 PM IST

  • ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​కు సన్మానం'

క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను కాపాడిన డ్రైవర్‌, కండక్టర్​ను సత్కరిస్తామని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. మరోవైపు, వీఐపీలు పంత్‌ను పరామర్శించడానికి వెళ్లొద్దని డీడీసీఏ అభ్యర్థించింది.


15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు..

2022 డిసెంబర్​లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్​తో పోలిస్తే 15 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

  • అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. మరో వ్యక్తి అరెస్టు

సామాజిక మాధ్యమాల్లో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు, పోస్ట్‌లు పెట్టిన కరీంనగర్‌ జిల్లా వాసి బైరి అగ్నితేజ్‌ను కమలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • రాజ్​భవన్​లో ఘనంగా న్యూఇయర్​ వేడుకలు

రాజ్​భవన్​లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.

  • పోడు రైతులకు శుభవార్త.. పట్టాల పంపిణీకి డేట్​ ఫిక్స్​..

రాష్ట్రంలోని పోడు రైతులకు మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభవార్త చెప్పారు. ఈ జనవరిలోనే పోడు రైతులకు పట్టాలు మంజూరు చేస్తామని ఆమె ప్రకటించారు. ఇప్పటికే గ్రామ, డివిజన్‌ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు గిరిజన గురుకులాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు.

  • కొత్తగా 'మన బడి'.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన 1210 పాఠశాలలు

రాష్ట్రంలో 'మన ఊరు-మన బడి' మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మండలానికి రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 1,210 బడులు కొత్త అందాలను సంతరించుకున్నాయి.

  • 'రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు.. 2024లో అధికార మార్పు పక్కా'

రాహుల్‌ గాంధీపై సంజయ్‌ రౌత్‌ కీలక వాఖ్యలు చేశారు. 2022లో రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు వచ్చిందని, అది 2023లో కూడా కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ మార్పు చూసే అవకాశం ఉందన్నారు. భాజపా విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.

  • న్యూఇయర్ వేళ శిర్డీకి భక్తుల వెల్లువ..

కొత్త సంవత్సరం వేళ శిర్డీ సాయిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన దంపతులు బాబాకు.. బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు.

  • మెగా టోర్నీల 2023కి 'వెలకమ్‌'..

కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టింది టీమ్‌ఇండియా. 2023లో వన్డే ప్రపంచకప్‌తోపాటు టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీల్లో భారత క్రికెట్​ జట్టు.. సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

  • తమన్నా, నయన్​తో షాపింగ్​కు ప్రభాస్​!..

అన్​స్టాపబుల్​-2లో ప్రభాస్​ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. 'చూసింది కూసింతే.. చూడాల్సింది కొండంత' అంటూ ట్వీట్​ చేసింది. మీరూ ఓ సారి ఆ ప్రోమోను చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details