తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్@ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Jan 1, 2023, 2:58 PM IST

  • 'హైదరాబాద్​ రాష్ట్రానికి కల్పతరువు.. అందుకే ఈ అభివృద్ధి'

అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాబోయే 50 ఏళ్ల వరకు మంచి నీటి కొరత లేకుండా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ కొత్తగూడ నుంచి కొండాపూర్‌ వరకు రూ.263 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు.

  • భక్తులతో కిక్కిరిసిన చిలుకూరు బాలాజీ ఆలయం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దఎత్తున బాలాజీ దర్శనానికి వచ్చారు. గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంతం మారుమోగిపోయింది.

  • 'పోలీస్' అభ్యర్థులకు బిగ్​ అలర్ట్​..

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్​పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం జరగుతున్న దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 5తో ముగియనుండటంతో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తి చేసేందుకు మండలి ఏర్పాటు చేసింది.

  • ప్రేమంటూ వేధించాడు.. ప్రాణాలు కోల్పోయాడు..!

ప్రేమ పేరుతో ఇద్దరు ఆకతాయిలు యువతిని వేధించారు. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. భయంతో ఆ యువకుల్లో ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

  • మంత్రిపై లైంగిక వేధింపుల కేసు..

హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్​పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఫిర్యాదు చేశారు. కాగా, తన పరువు తీయడానికే ఇలా కుట్ర పన్నారంటూ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు జరిగేంత వరకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

  • రెండేళ్ల నిషేధం తర్వాత 'భీమా కోరెగావ్'లో వేడుకలు..

భీమా-కోరెగావ్ యుద్ధానికి 205 ఏళ్లు పూర్తైన సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. రెండేళ్ల నిషేధం తర్వాత జరిగిన కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. అర్ధరాత్రే కోరెగావ్​కు చేరుకున్న ప్రజలు.. అక్కడ ఉన్న ఉన్న 'విజయస్తంభం' వద్ద నివాళులు అర్పించారు.

  • లక్షలాది బిర్యానీలతో 2023కి టేస్టీ వెల్​కమ్​.. బావర్చీలో నిమిషానికి రెండు..

కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆహార ప్రియులు అత్యధికంగా బిర్యానీని ఆరగించినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీ బిర్యానీకే అత్యధిక కస్టమర్లు మొగ్గు చూపినట్లు పేర్కొంది.

  • క్షిపణి పరీక్షతో కిమ్ న్యూఇయర్ వేడుక...

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు.

  • బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి పంత్ దూరం..

పంత్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్లను ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్షన్‌ కమిటీకి సవాలుగా మారింది. దీంతో అతన్ని రిప్లేస్​ చేసే వ్యక్తి కోసం కమిటీ సన్నాహాలు చేస్తోంది.

  • పోస్టర్​లో అలా.. వేడుకల్లో ఇలా.. 2023కి రణబీర్​ కిక్​ స్టార్ట్..!

ఓ వైపు 2022కు స్వీట్​గా బై చెప్పిన రణ్​బీర్​-ఆలియా నయా సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2022 తనకు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ తగ్గేదే లే అంటూ ఓ నయా లుక్​తో ఫ్యాన్స్​ ముందుకొచ్చాడు రణ్​బీర్​. ఆ లుక్​ ఏంటో ఓ సారి చూసేద్దామా..

ABOUT THE AUTHOR

...view details