తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 26, 2022, 7:01 AM IST

  • నేడు రాష్ట్రానికి ద్రౌపదీ ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. శ్రీశైలం, భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శించనున్న రాష్ట్రపతి.. హైదరాబాద్‌లో జరగనున్న వివిధ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.

  • 'సురవరం ప్రతాపరెడ్డి పరంపర కొనసాగుతూనే ఉంది'

ఎన్టీఆర్​ స్టేడియంలో నిర్వహిస్తున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన 'వల్లంకి తాళం' పుస్తకంపై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • బీఆర్​ఎస్​ పార్టీలో విభేదాలు..

నాగర్ కర్నూల్ బీఆర్​ఎస్​లో ముసలం మొదలైంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్వకుర్తి జడ్పీటీసీ భరత్.. తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఇకపై అచ్చంపేటలో పార్టీ శ్రేణులకు, ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించారు.

  • బీభత్సం సృష్టించిన టిప్పర్​..

గచ్చిబౌలిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, 2 బైకుల మీదకు ఓ టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.

  • 'అగ్నివీర్' అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రారంభం..

అగ్నిపథ్ పథకం ద్వారా వైమానిక దళానికి ఎంపికైన అభ్యర్థులకు బెళగావిలో సైనిక శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 2,850 మంది ఆరునెలల పాటు ఈ ట్రైనింగ్​ తీసుకోనున్నారు.

  • దేశంలో కొత్త వేరియంట్ కలవరం..

చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 భారత్‌ను భయపెడుతోంది. తాజాగా రెండు రోజుల క్రితం చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అతడి శాంపిల్స్​ను జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్​కు పంపారు అధికారులు.

  • కాటేసిన పామును ఆస్పత్రికి తీసుకెళ్లిన రైతు..

తనను కాటేసిన పామును ఏకంగా ఆస్పత్రికే తీసుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ ఘటన ఒడిశాలో జరిగింది. అతడు ఎందుకిలా చేశాడంటే?

  • భారత్​లో చైనా చొరబాటు.. బంగారం కంటే విలువైన ఆ 'ఫంగస్‌' కోసమేనా..?

ఇటీవల భారత్​ భూ భాగంలోకి చైనా అక్రమం చొరబాటుకు ప్రయత్నించింది. భారత్​ సైన్యం వారిని తిప్పికొట్టింది. అయితే వారు హిమాలయ ప్రాంతంలో దొరికే బంగారం కంటే అతి విలువైన ఓ 'ఫంగస్'​ కోసమే ఈ ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. అసలేంటా ఫంగస్​..?

  • వివాదాస్పద పోస్టులకు శార్దూల్‌ 'లైక్‌'లు..

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకొంది. అయితే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ శార్దూల్‌ ఠాకూర్‌కు మాత్రం ఆడేందుకు అవకాశం రాలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది.

  • అందరి కళ్లు జనవరి 8పైనే.. KGF స్టార్​ యశ్​ కొత్త సినిమా అప్డేట్?​

'KGF' సినిమాతో పాన్​ ఇండియా గుర్తింపు సంపాందించుకున్నారు నటుడు యశ్​. 'కేజీయఫ్​ 2' కూడా విడుదలై బ్లాక్​బస్టర్​గా నిలిచింది. దీంతో యశ్​ తదుపరి చిత్రంపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే యశ్​ కొత్త చిత్రం గురించి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

ABOUT THE AUTHOR

...view details