తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 22, 2022, 8:57 AM IST

  • కేసులు పడిపోవడంతో తగ్గిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌..

ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రజల్లోనూ ఒకింత ఆందోళన మొదలైంది. కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలను పాటించాలని సూచించింది. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని పేర్కొంది.

  • 'తెలంగాణలో టీడీపీ ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం'

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని క్రియాశీలకంగా చేయాలని తాను కోరుతున్నానన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని ఖమ్మం సభలో చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

  • వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్‌ కీలక చర్చలు..

గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంశంపై పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం మరో విడత చర్చలు జరిపారు. ఇదే అంశంపై ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపిన మంత్రి.. తాజాగా జరిపిన చర్చలు ఎంత వరకు ఫలించాయో చర్చలకు వెళ్లిన ప్రతినిధులు పెదవి విప్పకపోవడంతో ఏం జరుగుతుందోననే కలవరంలో వీఆర్​ఏలు ఉన్నారు.

  • 'తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలి'

తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని బీఆర్ఎస్ లోక్​సభాపక్ష నేత నామ నాగేశ్వరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బుధవారం ఎస్టీ ఆర్డర్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు.

  • కేంద్రం కీలక నిర్ణయం..

విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులను 3డీలో చూపించే అత్యాధునిక స్కానర్లను ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇక బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్‌ వంటివి బయటకు తీసి చూపించే బాధ ప్రయాణికులకు ఇక తప్పేలా ఉంది.

  • రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత..

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 8.9, హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • 'ప్రైవేట్​ క్రిప్టోలను పెంచి పోషిస్తే మరో ఆర్థిక సంక్షోభమే'

బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పందించారు. వాటిని మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు.

  • నేపాల్‌ సుప్రీంకోర్టు ఆదేశం.. సీరియల్‌ కిల్లర్‌ చార్లెస్‌ శోభరాజ్‌ విడుదల!

ఆరోగ్య కారణాల రీత్యా అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నేపాల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్‌పై పెండింగు కేసులు లేకపోతే విడుదలైన తర్వాత స్వదేశానికి పంపేయాలని కోర్టు సూచించింది.

  • భారీగా పెరిగిన IPL విలువ..

ఐపీఎల్‌ తాజాగా రూ.87 వేల కోట్ల విలువకు చేరుకుందట. డీఅండ్‌పీ అనే సంస్థ ఈ మేరకు ఐపీఎల్‌ విలువను లెక్కగట్టింది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో ఐపీఎల్‌ మీడియా హక్కులు వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.48 వేల కోట్లు పలికింది. దీంతో ఐపీఎల్‌ విలువ కూడా పెరిగి 10.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

  • త్వరలోనే డైరెక్టర్​గా మూవీ తీస్తా.. కానీ అందులో నేను నటించను: అనుపమ

అనుపమ పరమేశ్వరన్‌.. కథల్ని ఎంపిక చేసుకోవడంలో ఆమె ప్రత్యేకం. 'కార్తికేయ2'తో విజయాన్ని సొంతం చేసుకున్న అనుపమ.. నిఖిల్​తో కలిసి '18 పేజెస్‌'లో నటించింది. బుధవారం ఈ సినిమా థియేటరల్లోకి రానున్న నేపథ్యంలో ఆమె ముచ్చటించిన విశేషాలు మీకోసం..

ABOUT THE AUTHOR

...view details