తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్​ @9PM - telangana news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Dec 16, 2022, 8:57 PM IST

  • ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. బీజేపీ బండారం బయట పెట్టినందుకే కక్ష పూరితంగా తనకు ఈడీ నోటీసులిచ్చిందని రోహిత్ రెడ్డి ఆరోపించారు.

  • రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ కేసులో గత ఏడాది సెప్టెంబర్​లో రకుల్​ను ఈడీ విచారించింది. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీచేసింది.

  • 'విజన్‌-2020'కల సాకారం.. నెక్ట్స్‌ టార్గెట్‌ 2029: చంద్రబాబు

హైదరాబాద్‌లో ఐఎస్‌బీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు.. ఐఎస్‌బీ విద్యార్థులతో పంచుకున్నారు.

  • దమ్మాయిగూడలో కనిపించిన అమ్మాయి అనుమానాస్పద మృతి.. న్యాయం కోసం స్థానికుల ఆందోళన

పాఠశాలకు వెళ్లిన చిన్నారి అనుమానాస్పదంగా మృతిచెందడంతో హైదరాబాద్‌ దమ్మాయిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు, అంబులెన్స్‌ను స్థానికులు అడ్డుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  • భుట్టో వ్యాఖ్యలపై భగ్గుమన్న భాజపా.. భారత్‌ను చూసి ఓర్వలేకే అంటూ..

పాకిస్థాన్​ మరింత దిగజారింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విషం కక్కిన దాయాది దేశం.. ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో పాతాళానికి పడిపోయింది. లాడెన్‌ సహా ఉగ్రవాదులకు దేశాన్ని స్వర్గధామంలా మార్చిన పాక్‌.. ఐరాసలో భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.

  • 'చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోంది'.. రాహుల్​ ఫైర్​!

మన దేశంపై చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. రాజస్థాన్​లో భారత్​ జోడో యాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో రాహుల్​ ఆ వ్యాఖ్యలు చేశారు.

  • 'జైల్లో రక్షణ లేదు.. బెయిల్ ఇవ్వండి'.. కోర్టుకెళ్లిన ఆఫ్తాబ్‌

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. జైల్లో తనకు రక్షణ లేదని, బెయిల్‌ ఇవ్వాలని కోరడం గమనార్హం.

ముగిసిన మూడో రోజు ఆట.. నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?

తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్, పుజారా సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ ఆధిక్యం 512 పరుగులకు చేరింది. ఇంకా రెండో రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం రావడం ఖాయం. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగా బౌలర్లు అదరగొడితే విజయం మనదే.

  • ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భీకర దాడి.. 60కిపైగా క్షిపణుల ప్రయోగం.. ఆ ప్రాంతాల్లో కరెంట్​ కట్​

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్‌, ఖార్కివ్‌ సహా నాలుగు నగరాలపై 60కిపైగా క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణంలో క్షిపణి దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఖార్కివ్‌ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. అనేక చోట్ల రైళ్లను స్టీమ్‌ ఇంజిన్లతో నడపాల్సిన పరిస్థితి నెలకొంది.

  • 'అవతార్‌-2 కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించా.. ఆయనలా ఆగిపోదామనుకున్నా'

అవతార్‌2 సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కోసం జేమ్స్‌ కామెరూన్‌ ఎంత కష్టపడ్డారో చెప్పారు. అవతార్​ సీక్వెల్​ విషయంలో చాలా ఆలోచించానని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details