తెలంగాణ

telangana

By

Published : Dec 15, 2022, 9:01 AM IST

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్​న్యూస్ @9AM
Telangana Top News: టాప్​న్యూస్ @9AM

  • కిలోమీటర్​ @221 గుంతలు..

Road Damaged in Nakirekal : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నకిరేకల్‌ పరిస్థితి. పేరుకు నియోజకవర్గ కేంద్రమైనా.. కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రధాన కూడలిలోని తిప్పర్తి రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు అడుగడుగునా గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.

  • నేడు జరగాల్సిన GRMB సమావేశం వాయిదా..

GRMB Meeting Postponed : నేడు జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా పడింది. మాండౌస్​ తుపాను నేపథ్యంలో సమావేశానికి రాలేమన్న ఏపీ ఆధికారుల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వచ్చే నెల 3కు వాయిదా వేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం అందించింది.

  • నవీన్​రెడ్డి సహా ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. సురక్షితంగా లేనని.. కోర్టులో నవీన్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను గంట నిడివి ఉన్న వీడియోను విడుదల చేస్తే.. పోలీసులు మీడియాకి చేరకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. కస్టడీకి ఇవ్వాలంటూ నేడు కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

  • రూ.12 కోట్ల కారు కొనుగోలు చేసిన హైదరాబాద్‌ యువకుడు

నేటి యువత మార్కెట్​లో వచ్చే సూపర్ బైక్​లు, కార్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ వద్ద బ్రాండెండ్ కార్లు, బైకులు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కోవకే చెందుతాడు హైదరాబాద్​కు చెందిన నసీర్‌ఖాన్‌ అనే యువకుడు. సూపర్​ కార్లంటే ఎంతో ఇష్టపడే ఇతగాడు.. ఏకంగా రూ.12 కోట్ల కారును కొనుగోలు చేశాడు.

  • చైనా దూకుడుకు చెక్.. తూర్పు సెక్టార్​లో వాయుసేన యుద్ధ విన్యాసాలు

తూర్పు సెక్టార్‌లో భారత వాయుసేన గురువారం నుంచి రెండు రోజుల పాటు యుద్ధవిన్యాసాలను నిర్వహించనుంది. ఇటీవల భారత్​-చైనా మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విన్యాసాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, పాంగాంగ్​ సరస్సు సమీపంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోంది.

  • నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన నిర్మించిన తండ్రీకొడుకులు

ఆ ఊరికి వెళ్లాలంటే నది దాటాలి. కానీ అది దాటడానికి బ్రిడ్జ్​ లేదు. ఈ కారణంగా ఇబ్బంది పడుతున్న తన గ్రామ ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు ఓ డ్రైవర్​. ఉపాధిని వదులుకొని, తన భార్య నగులు తాకట్టు పెట్టి బ్రిడ్జ్​ కట్టాడు. కుమారుడి ఆశయానకి తండ్రి కూడా సహాయం చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

  • 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు..

ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు.

  • 'దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు.. రూ.1500 కోట్ల లాభం టార్గెట్'

యూకో బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ సోమ శంకర ప్రసాద్‌ తెలిపారు. బ్యాంకు మొండి బకాయిలు తగ్గుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలు నెలకొల్పనున్నట్లు చెప్పారు.

  • సెమీస్‌లో మొరాకో చిత్తు.. ఫైనల్‌కు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA World Cup 2022 :సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోను.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో ఫ్రాన్స్‌ 2-0 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఆదివారం జరిగే ఫైనల్‌లో.. ఈ మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది.

  • 'ఆ సీన్‌లు సరిచేయాల్సిందే'.. బేషరమ్ సాంగ్‌పై హోంమంత్రి తీవ్ర అభ్యంతరం

షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొణె నటించిన పఠాన్‌ చిత్రంలోని 'బేషరమ్‌ రంగ్‌' రొమాంటిక్‌ సాంగ్‌ వివాదాస్పదమవుతోంది. ఈ పాటలో అభ్యంతరకర సీన్‌లు సరిచేయాలంటూ చిత్రబృందానికి మధ్యప్రదేశ్‌ హోంమంత్రి వార్నింగ్‌ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details