తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2022, 9:01 AM IST

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS

  • మలిదఫా సర్కార్​లో 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం కేసీఆర్

కేసీఆర్ మలిదఫా సర్కార్.. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తిచేసుకుంది. కోవిడ్ సంక్షోభం, కేంద్రం ఆంక్షలకుతోడు.. భాజపాతో రాజకీయ వైరం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. వివిధరంగాల్లో వృద్ధిరేటు బాగానే ఉన్నా ఆశించిన మేర కేంద్రం నుంచి సహకారం లేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతోంది.

  • కమిటీల ఏర్పాటుపై కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. చల్లారేదెలా..?

కాంగ్రెస్‌లో కమిటీల ప్రకటనతో పెల్లుబికిన అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం కమిటీల ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నేడు ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతలతో సమావేశం తర్వాత మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ మీడియా ముందుకు రానున్నారు. తదుపరి కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

  • 8 ఏళ్లలో వైద్యకళాశాలల్లో 127శాతానికి సీట్లు పెరిగాయి: హరీశ్​రావు

సిద్దిపేట వైద్యకళాశలలో జరిగిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50పడకల ప్రభుత్వాస్పత్రి భవన నిర్మాణానికి హరీశ్ శంకుస్థాపన చేశారు.

  • పెట్టుబడులకు సురక్షిత, లాభదాయక గమ్యస్థానంగా తెలంగాణ: కేటీఆర్‌

8 ఏళ్లలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ రాకెట్‌ను తొలిసారి అంతరిక్షంలోకి పంపిన అంకురసంస్థ "స్కైరూట్" హైదరాబాద్‌కు చెందినదే కావడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరగనున్న టై గ్లోబల్‌ సమ్మిట్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు.

  • తవాంగ్‌పై చైనాకు ఎందుకింత ఆరాటం.. అసలు కారణం ఇదే!

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద చైనా పదే పదే ఘర్షణలకు దిగుతుంది. ఆ ప్రాంతాన్ని దాని ఆధీనంలోకి తీసుకోవాలని దుస్సాహసానికి పాల్పడుతోంది. తవాంగ్​ భారత భూభాగమని ప్రపంచం గుర్తించిన డ్రాగన్‌ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఆరాటం అంతా చైనా వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే. చైనా ఎందుకు ఇలా చేస్తోంది.

  • ఫిఫా ప్రపంచకప్​ ఫైనల్లో అడుగు పెట్టేదెవరో? సెమీస్​లో అర్జెంటీనాతో క్రొయేషియా ఢీ

నాలుగేళ్ల క్రితం.. ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ చేరినా కప్పు చిక్కలేదు. ఈ సారి అదే కసితో.. అగ్రశ్రేణి జట్లకు షాకిస్తూ.. ప్రపంచకప్‌ కోసం పట్టుదలతో పయనిస్తోంది క్రొయేషియా. కప్పు కోసం ఆఖరి వేటకు అర్హత సాధించేందుకు ఈ రెండు జట్లు సై అంటున్నాయి.

  • వచ్చే వారం నుంచే ఇండియా-రష్యా వాణిజ్యం రూపాయల్లో

వచ్చే వారం నుంచే రష్యాతో వాణిజ్య చెల్లింపులు రూపాయల్లో జరగనున్నాయి. దేశం నుంచి ఔషధాలు, వాహన విడిభాగాలు దిగుమతి చేసుకునేందుకు రష్యా నుంచి డిమాండ్లు రావడమే ఇందుకు నేపథ్యం. దీంతో రష్యాతో భాతర వాణిజ్య లోటును తగ్గించేందుకు వీలవుతుంది.

  • 'వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త!'.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

  • బరువు తగ్గాలంటే ఆరోగ్య క్రమశిక్షణతో పాటు ఓపిక కూడా ఉండాలి

బరువు తగ్గటమనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. దీనికి సమయం పడుతుంది. ఓపికతో ఆహార, వ్యాయామ నియమాలను పాటించటం అత్యవసరం. అధిక బరువుతో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాల సమస్యల ముప్పు పెరుగుతుంది. కొన్నిరకాల క్యాన్సర్లూ తలెత్తొచ్చు. వయసు మీద పడుతున్నప్పుడు చురుకుదనమూ తగ్గుతుంది.

  • టాలీవుడ్​ను షేక్​ చేసిన కొత్తందాలు.. 2022లో తెరపైకి నూతన నాయికలు

చిత్రసీమకి ఊపిరి కొత్తదనం. భవిష్యత్తు కొత్తతరం! మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా కథల్లోనూ, సాంకేతికతలోనూ, నటనలోనూ ఇలా అన్నిచోట్లా కొత్తదనం కనిపించాల్సిందే. కొత్తదనం అంటే కొత్తతరంతోనే సాధ్యం అని పరిశ్రమ నమ్మిన ప్రతిసారీ తెరపైన ఓ నవ తార మెరుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details