తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @3PM - Top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 12, 2022, 3:00 PM IST

  • తల్లిదండ్రులు కాబోతున్న రామ్​చరణ్​-ఉపాసన

చిరంజీవి కుటుంబంలో మరో ఆనందం. రామచరణ్‌ తండ్రి కాబోతున్నట్లు చిరంజీవి ట్వీట్‌ చేశారు. హనుమాన్ దయవల్ల రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలిపారు.

  • గుజరాత్​ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం..

గుజరాత్​లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు భూపేంద్ర పటేల్​. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

  • మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కేంద్ర జీఎస్‌టీ సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై కేంద్ర జీఎస్‌టీ అధికారులు దాడులు చేశారు. ఏకకాలంలో 15 చోట్ల జీఎస్​టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

  • 'ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కేసీఆర్ రూ.వేలకోట్లు పంపిస్తున్నారు'

దిల్లీ మద్యం కేసుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా జాతీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

  • ఎయిర్​పోర్ట్​లో కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీ..

దిల్లీ విమానాశ్రయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ, ఇతర సమస్యలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • కుమార్తె మెహందీ వేడుకలో డాన్స్ చేస్తూ తండ్రి మృతి..

కుమార్తె మెహందీ వేడుకల్లో డాన్స్​ చేస్తూ గుండెపోటుతో మరణించాడు ఓ తండ్రి. ఆనందంగా స్టెప్పులేస్తూనే కుప్పకూలాడు. ఉత్తరాఖండ్​లో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా తండ్రి మరణ వార్తను కూతురికి చెప్పకుండానే పెళ్లి తంతు నిర్వహించారు పెద్దలు.

  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్..

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాకినాడకు చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ.. బెయిల్ నిబంధనలను ట్రయర్ కోర్టు నిర్దేశిస్తుందని పేర్కొంది.

  • డబ్బు విషయంలో ఈ భయాలున్నాయా? అయితే ఇది మీ కోసమే!

మనలో చాలా మంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటి.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా?

  • రొనాల్డోపై కోహ్లీ ఎమోషనల్ పోస్ట్​.. ఏ టైటిల్స్​, ట్రోఫీలు మాకు అక్కర్లేదంటూ..

స్టార్ క్రికెటర్ కోహ్లీకి ఫుట్​బాల్​ దిగ్గజ ప్లేయర్​ రొనాల్డో అంటే ఎంత ఇష్టమో క్రీడా ప్రేమికులకు తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా సార్లు అతడిపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అయితే ఈ సారి రొనాల్డోను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు విరాట్​.

  • 'కాంతార' హీరోను చూస్తుంటే అసూయగా ఉంది: బాలీవుడ్ స్టార్​

కాంతార హీరో రిషబ్​శెట్టిని చూస్తుంటే అసూయగా ఉందని అన్నారు ఓ బాలీవుడ్ స్టార్​ యాక్టర్​. అలాగే సౌత్​ సినిమాలను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్​ చేశారు మరో బీటౌన్​ స్టార్ డైరెక్టర్​. ఏం అన్నారంటే..

ABOUT THE AUTHOR

...view details