తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM - telangana topnews today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

11AM TOPNEWS
11AM TOPNEWS

By

Published : Dec 11, 2022, 10:57 AM IST

  • ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ..

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ బృందం చేరుకుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆమె వాంగ్మూలం నమోదు చేయనున్నారు.

  • ఇవాళ వివాహం.. రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కుమార్తె

నిజామాబాద్​లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికొడుకు వేధింపులతో పెళ్లి కుమార్తె రాత్రి ఉరివేసుకొని చనిపోయింది. వీరిద్దరి పెళ్లి ఇవాళ మధ్యాహ్నం జరగాల్సి ఉంది.

  • 'నల్లగా ఉన్నాడు నాకీ పెళ్లి వద్దు'.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు

వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లికి నిరాకరించింది ఓ వధువు. దండలు మార్చుకునే సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

  • ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించిన భర్త

ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని ఓ వ్యక్తి తన భార్యకు గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీంతో ఆ వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • రంగోలీతో అతి చిన్న సాయిబాబా చిత్రం వేసిన టీచర్ ప్రపంచ రికార్డు దాసోహం

మహారాష్ట్రలో శిరిడీ అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్‌గావ్‌కు చెందిన మసూద దారూవాలా అనే స్కూల్ టీచర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అతిచిన్న సాయిబాబా చిత్రాన్ని వేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు.

  • సజీవ ఔషధం సిద్ధం.. అవయవ మార్పిడి రోగులకు వరం.. క్యాన్సర్​పైనా పోరు!

అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సమస్యకు శాస్త్రవేత్తలు విరుగుడును కనుగొన్నారు. ఇందుకోసం ఒక 'సజీవ ఔషధాన్ని' అభివృద్ధి చేశారు. ఇది అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు వరంలాంటిదని పరిశోధకులు భావిస్తున్నారు.

  • 'బీమా రంగం కొత్త పుంతలు.. డిజిటలీకరణతో సులభంగా సేవలు..'

బీమా పాలసీల అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, దేశంలో ఈ సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని ఎస్​బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ మహేశ్ శర్మ తెలిపారు. డిజిటలీకరణ పెరగడమూ ఇందుకు ఓ కారణమని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

  • పదో వన్డేలోనే అద్భుత ఘనత.. ఇలాగే చెలరేగితే ఎదురు ఉండదిక!

టీమ్​ఇండియా ప్లేయర్​ ఇషాన్​ కిషన్​ వన్డేలో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తన పదో వన్డేలోనే డబుల్ సెంచరీతో చెలరేగి క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాతైనా ఇషాన్‌ నిలకడ అందుకుని తన ప్రతిభకు న్యాయం చేస్తాడేమో చూడాలి

  • 'మనల్ని ఎవడ్రా ఆపేది'.. పవన్​- హరీశ్​ సినిమాకు కొత్త టైటిల్.. అదిరే పోస్టర్!

పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్‌, హరీశ్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్​ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్​ వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టర్​ను సైతం విడుదల చేసింది.

  • త్వరలో సరికొత్తగా ఢీ15.. గ్రాండ్​గా లాంచ్ ఈవెంట్.. ప్రభుదేవా ఏమన్నారంటే?

తెలుగు బుల్లితెరపై తనడైన స్టార్​డమ్ తెచ్చుకున్న షోస్​లో ఢీ ఒకటి. 14 సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేస్తున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌లో అడుగుపెట్టబోతోంది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా డ్యాన్స్​ కొరియోగ్రాఫర్​ ప్రభుదేవా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details