తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 8, 2022, 4:58 PM IST

Updated : Dec 8, 2022, 5:18 PM IST

  • మరోసారి గుజరాత్​ సీఎంగా భూపేంద్ర పటేల్..

భూపేంద్ర పటేల్​ మరోసారి గుజరాత్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

  • హిమాచల్​లో కాంగ్రెస్​ జాక్​పాట్..

మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఐదేళ్లకోసారి గద్దె దించే పద్ధతిని ఈసారీ పాటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా ఓటమి చవిచూడగా.. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

  • మోర్బీ 'సాహస వీరుడు' కాంతిలాల్​ ఘనవిజయం..

గుజరాత్​.. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన భాజపా మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్​ అమృతియా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 62వేలకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు, ఆమ్​ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్​ గఢ్వీ ఓటమి పాలయ్యారు.

  • మోదీని ఢీకొట్టే శక్తి!.. జాతీయ ప్రత్యామ్నాయంగా 'ఆప్'..

పాన్-ఇండియా పార్టీగా మారి.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్​కు గుజరాత్ ఎన్నికలు బాగానే ఉపయోగపడ్డాయి. జాతీయ అజెండాకు అనుగుణంగా పార్టీ సైతం 'నేషనల్ పార్టీ' ట్యాగ్​ను దక్కించుకుంది. భవిష్యత్​లోనూ పార్టీ వ్యూహాలను పక్కాగా ఖరారు చేసుకుంది. 2024 సార్వత్రికమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

  • 'ఫేక్ హామీలు, బుజ్జగింపు రాజకీయాలకు ప్రజలు నో'.. 'ఆప్​, భాజపా సీక్రెట్​ డీల్​!'

గుజరాత్​లో భాజపా అఖండ విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. బూటకపు వాగ్దానాలు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి ప్రజలు బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. మరోవైపు గుజరాత్​లో భాజపాకు, ఆప్​కు రహస్య అవగాహన ఉందేమోననని అనుమానం కలుగుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

  • మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్... మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అక్కడ నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లి తేనీటి విందు స్వీకరించి.. హైదరాబాద్‌కు వచ్చారు.

  • 'రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ జెండా ఎగురవేస్తుంది'

గుజరాత్​లో బీజేపీ ఘన విజయం సాధించింది. వరుసగా ఏడోసారి కమలం వికసించింది. ఈ ఫలితాలపై రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ స్పందించారు. వరుసగా ఏడోసారి బీజేపీకి పట్టం కట్టిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

  • రైలు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని మృతి

బుధవారం ఏపీలోని అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఫ్లాట్​ మధ్యలో ఇరుకున్న ఎంసీఏ విద్యార్థిని ఈరోజు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.

  • పంత్​-శాంసన్​ వివాదం..

కొంతకాలంగా టీమ్​ఇండియాలో పంత్​-శాంసన్​ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంసన్​ను పక్కనపెట్టి పంత్​కు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అని ఇప్పటికే క్రికెట్ ప్రేమికులు, మాజీలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

  • ఫ్యామిలీతో విహార యాత్ర.. శ్రుతిహాసన్​తో వీరయ్య యాత్ర

ఇటీవలే గాడ్​ఫాదర్​ సినిమాలో సూపర్​ సక్సెస్​ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్యతో బిజీగా గడపుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. చిత్రీకరణలో భాగంగా ఓ సాంగ్ షూట్​ కోసం ఆయన కథానాయిక శ్రుతిహాసన్​తో కలిసి యూరప్​ వెళ్లారు.

Last Updated : Dec 8, 2022, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details