'ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు.. రేపు విచారణకు రాలేను'దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు నోటీసులివ్వడంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు. సీబీఐ ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని.. ఈ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. గ్రూప్-4కు ట్రై చేస్తున్నారా.. ఇలా చదివితే జాబ్ పక్కా..!ఉద్యోగార్థుల ఎదురుచూపులకు తెర వేస్తూ 9,168 గ్రూప్- 4 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయింది. యూపీఎస్సీ అభ్యర్థులతో సహా లక్షల మంది ఈ పరీక్ష రాయాలని తపన పడుతున్నారు. భగీరథ నీరు.. డయేరియా పరారుకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. వైద్యచికిత్సలు అందుబాటులో ఉండటంతో టైఫాయిడ్ కేసులలో తగ్గుదల కనిపిస్తోంది. 'ఆ మూడు గనులు తెలంగాణకు అప్పగించేదేలే'తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి. లూడో గేమ్‌లో తనను తానే బెట్టింగ్ పెట్టిన మహిళ..కొందరు ఆటల్లో బెట్టింగ్‌లు కాసి.. ఆస్తిని, ఉద్యోగాన్ని కోల్పోయి.. కుటుంబంతో సహా రోడ్డున పడిన సందర్భాలు చాలానే చూశాం. కానీ ఓ మహిళ తనని తానే పణంగా పెట్టి ఓ గేమ్ ఆడింది. ఈ ఆటలో ఆమె ఓటమి పాలవగా వేరే వాళ్ల వశమైంది. ఈ వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఓటు వేసిన ప్రధాని, సీఎంప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రాణిప్ నిషాన్ స్కూల్లో ఆయన ఓటు వేశారు. శిలాజ్ అనుపమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. డ్రైవర్ రహిత కార్లు ఇప్పుడే కాదు.. త్వరలోనే డ్రైవర్ రహిత వాహనాల రాబోతున్నాయి అని అనేక కంపెనీలు ప్రకటన చేస్తున్నాయి. అయితే ఇది సులువేమీ కాదంటున్నారు ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఏఐ ప్రొఫెసర్ కె.సుబ్బారావు. పూర్తిస్థాయిలో సాకారానికి ఇంకా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇలా చేస్తే మీ వాట్సాప్ డేటా సురక్షితం..వాట్సాప్‌లో మన చాటింగ్ సురక్షితమే అని అనుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నప్పటికి వాటిని మనం సద్వినియోగం చేసుకోకుంటే మన డేటా హ్యాకర్ల చేతిలో పడ్డట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్లు చెదిరేలా మ్యాజిక్ గోల్..ప్రపంచకప్‌లో ఓ ఫుట్‌బాలర్ తన అద్భుతమైన గోల్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. చరిత్రలోనే కళ్లుచెదిరే గోల్స్‌పై ఫిఫా నిర్వహించిన ఓ పోల్‌లో ఆ గోల్‌కు 7వ స్థానం దక్కడం విశేషం. ఆ మ్యాచ్ సంగతులు చూద్దాం.. అదరగొడుతున్న 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' వెబ్‌సిరీస్..గతవారం స్ట్రీమింగ్ మొదలైన 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.