తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్​ @7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Dec 1, 2022, 6:59 AM IST

  • గుజరాత్​ తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధం

హోరాహోరీగా సాగిన గుజరాత్​ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగియగా.. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై​.. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

దిల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తి కరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా దిల్లీ మద్యం స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఈడీ అధికారులు చేర్చారు. అమిత్​ ఆరోరా రిమాండ్​ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్​ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

  • 'హామీలు ఇవ్వటం తప్ప కేసీఆర్‌ ఏమీ పరిష్కరించరు'

బండి సంజయ్ తనదైన శైలిలో సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హామీలు ఇవ్వటం తప్ప .. ఏమీ పరిష్కరించరని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.

  • ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారుల కౌంటర్..

ఎమ్మెల్యేలకు ఎరకేసులో సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. ఇప్పటివరకు జాబితాలో లేని కొత్త పేర్లను అధికారులు ప్రస్తావించారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు అందుకున్న వారి జాబితాను పేర్కొన్నారు. నిందితులతో అనుమానితుల కాల్ డేటాను న్యాయస్థానానికి సమర్పించారు.

  • భారీగా తగ్గనున్న ఆ రైలు టికెట్‌ ధరలు!

రైలులో ప్రయాణించే పర్యటకుల కోసం ఐఆర్​సీటీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ గౌరవ్‌ రైలు టికెట్‌ ధరలను భారీగా తగ్గించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • క్యాన్సర్‌ కేసులు అబ్బాయిల్లోనే అధికం..

దేశంలో నమోదవుతోన్న క్యాన్సర్‌ కేసుల్లో అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. చాలా మంది బాలికల్లో ఈ లక్షణాలు ఉన్నప్పటికీ.. సమాజంలో ఉన్న వివక్ష కారణంగా వారు బయటకురావడంలేదని లాన్సెట్​ నివేదిక వెల్లడించింది.

  • అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా ఎక్కడ?

చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసి ఆ దేశ పాలకుల ఆగ్రహానికి గురైన ప్రముఖ వ్యాపారవేత్త జాక్‌ మా గత కొంత కాలంగా బయట పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడుంటున్నారు.. ఏం చేస్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • ఐసిస్‌ చీఫ్‌ అబూ అల్‌ హసన్‌ ఖురేషీ హతం..

ఇస్టామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ అల్‌-హసన్‌ అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ హతమయ్యాడు. తమ నాయకుడు మృతిచెందినట్టు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. అందులో అబు అల్‌-హసన్‌ స్థానంలో ఐఎస్‌ కొత్త చీఫ్‌గా అబూ అల్‌-హుస్సేన్‌ అల్‌-హుస్సేని అల్‌-ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది.

  • వెన్నునొప్పితో బాధ పడుతున్న పంత్​..

టీమ్​ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్​ రిషబ్‌ పంత్‌ వెన్నునొప్పితో బాధ పడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా తాను ఔటైన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో వెన్నునొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. స్ట్రెచర్‌పై పడుకున్న పంత్‌ ఫోటోలు లీకై సోషల్​మీడియాలో వైరల్ అయ్యాయి.

  • ప్రెగ్నెంట్​ అంటూ ప్రచారం క్లారిటీ ఇచ్చిన మలైక అర్జున్​

బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా రిలేషన్‏షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ పూకార్లను గతంలో మలైకా కొట్టిపారేసింది. అయితే కొద్దిరోజులుగా మలైకా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై తాజాగా ఈ జంట స్పందించిది. ఏం చెప్పిందంటే

ABOUT THE AUTHOR

...view details