ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలునేడు అసలైన సమరం.. Indian Racing League in Hyderabad: రయ్‌రయ్‌మంటూ శబ్దాలు.. మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లీగ్ తొలి రోజు క్వాలిఫయర్ నిర్వహించాల్సి ఉండగా.. ట్రాక్‌పై అవగాహన కోసం డ్రైవర్లు రోజంతా సాధన చేశారు. ఇవాళ అసలు సిసలైన పోటీలు జరగనున్నాయి.నేడే కివీస్‌తో భారత్ ఢీ..IND VS NZ T20: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా నేడు రెండో టీ20లో కివీస్‌తో తలపడనుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు అవ్వగా.. రెండో మ్యాచ్‌లో ఇరు జట్లు తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి.పంజా విసురుతున్న చలి.. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువకు పడిపోవడం వల్లే చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని అంచనా వేసింది.కోతకు గురైన సదర్మాట్ డ్యామ్..150 years old Sadarmat dam has been damaged in Nirmal: పురాతన ఆనకట్ట కోతకు గురైంది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లోని సదర్మాట్ ఆనకట్టకు గోదావరి మూడు నెలలు భారీ ప్రవాహం రావడంతో పూర్తిగా గండిపడింది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారు..? Delhi liquor scam case update: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు నిందితులకు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య కనికా టెక్రివాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది.రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు..CBN FIRES ON CM JAGAN : ఆంధ్రప్రదేశ్‌లో ఇంతటి దారుణమైన.. నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని.. గత మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ‘ఇదేం ఖర్మ’ పేరిట కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.కాలేజీ అమ్మాయికి బలవంతంగా ముద్దులు.. విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్ అంటూ లైంగికపరమైన వేధింపులకు పాల్పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మందిపై కాలేజీ యాజమాన్యం వేటు వేసింది.చెట్లు పెంచాల్సిందే!పరిసరాల్లో చెట్ల సంఖ్య పెరిగితే అకాల మరణాలకు కళ్లెం వేయవచ్చని ఓ అధ్యయనం రుజువు చేసింది. నాటిన ప్రతి మొక్క ద్వారా ప్రాణాలు నిలుస్తున్నాయని అందులో వెల్లడైంది. ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటిన చోట మరణాల రేటు, తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.త్వరలోనే ఆహార ద్రవ్యోల్భణ అంచనా విధానం.. కొవిడ్-19 మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఉక్రెయిన్ యుద్ధం రూపంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత, ఇంధన కొరత తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు.బడ్జెట్ రూ.6 కోట్లు.. వసూళ్లు రూ.40 కోట్లు..బసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా నటించిన 'జయ జయ జయ జయహే' రూ.6కోట్లతో తీస్తే, రూ.40 కోట్లు వసూలు చేసింది. మరి ఈ చిత్రం ఏ ఓటీటీలో వస్తోందో తెలుసా?