తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today

By

Published : Oct 29, 2022, 5:01 PM IST

  • పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులు.. మరోసారి వాంగ్మూలం

టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను అదుపులోకి తీసుకున్న ఎస్‌వోటీ పోలీసులు..ముగ్గురినీ సైబరాబాద్ సీపీ కార్యాలయానికి తరలించారు.

  • 'సమయం వచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు'

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ఏం మాట్లాడినా వక్రీకరిస్తారని చెప్పారు. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు.

  • 'ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్​లు ఎందుకు సీజ్​ చేయలేదు?'

మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస, భాజపా కలిసి వ్యూహాత్మకంగానే వివాదం సృష్టిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఎమ్మెల్యేల ఎర కేసులో రోహిత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు.

  • రూ.30 వేలు తీసుకుని.. రూ.40 లక్షలు చెల్లించాడు.. అయినా..!

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. లోన్​ యాప్​ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. రుణం ఇచ్చి తిరిగి చెల్లించినా వేధింపులకు గురిచేస్తూ యాప్​ల నిర్వాహకులు అరాచకాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.30 వేలు అప్పుగా తీసుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా రూ.40 లక్షలు చెల్లించాడు.

  • ఏపీ, తమిళనాడులోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈశాన్య రుతుపవనాలు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది.

  • ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మన రక్షణశాఖే..

ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా భారత రక్షణశాఖ నిలిచింది. సైనికులు, సైనికేతరులు కలిపి 29లక్షల 20 వేల మంది సిబ్బందితో భారత రక్షణ శాఖ ప్రపంచంలోనే అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉందని జర్మనీకి చెందిన స్టాటిస్టా వెల్లడించింది.

  • 'మానవాళికి ఉగ్రవాదం ముప్పు.. ముష్కరులకు కీలక ఆయుధంగా 'సోషల్ మీడియా'!'

మానవాళికి ఉగ్రవాద ముప్పు పెరుగుతోందని.. ఇది మరింత విస్తరిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ 'గ్రే లిస్ట్‌' వల్లే జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులు తగ్గిపోయాయని పాక్‌ను పరోక్షంగా భారత్ ప్రస్తావించింది.

  • కేఎల్ రాహుల్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌..

ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియాకు కీలక పోరు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్‌ఇండియా దాదాపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోవడం ఖాయం. అయితే భారత్ రాణిస్తున్నప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

  • 'నా అనారోగ్య సమస్య ఇదే.. త్వరలోనే రికవరీ అవుతా'

టాలీవుడ్​ అగ్ర కథానాయిక సమంత ఓ వ్యాధితో బాధ పడుతోంది. దీంతో అమె అభిమానులు అందోళన చెందారు. తాజాగా ఆమె తన సోషల్​ మీడియా ఖాతాల్లో ఓ ఫొటో షేర్ చేసింది.

  • 'కాంతార'కు కోర్టులో చుక్కెదురు..

'కాంతార' గత కొన్ని రోజులుగా వివాదాల్లో ఉంది. ఈ సినిమాపై కోర్టులో ఇదివరకే ఓ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో 'కాంతార' టీమ్​కు కోజికోడ్‌ కోర్టులో చుక్కెదురైంది. ఇక నుంచి దాన్ని ప్రదర్శించకూడదు అంటూ ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details