తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - టాప్​న్యూస్ 7AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News

By

Published : Oct 29, 2022, 7:00 AM IST

  • తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపర్చారు. ప్రభుత్వాన్ని అస్తిరపర్చేందుకే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా పేర్కొన్నారు. ప్రత్యేక ఆపరేషన్‌లో నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్‌ రికార్డర్లు వాడినట్టు కోర్టుకు తెలిపారు.

  • 'నేల విడిచి సాము'.. నింగికి చేరిన రష్యా- ఉక్రెయిన్ పోరు..!

గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఉక్రెయిన్​కు అమెరికా అండగా ఉందని రష్యా రగిలిపోతోంది. ఈ క్రమంలో యుద్ధం నేలతో పాటు నింగికీ చేరేలా ఉంది. ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న 'ఉపగ్రహాలను కూలగొడతాం' అంటూ రష్యా తాజాగా బెదిరింపులకు దిగింది.

  • ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ మీడియానే హంగామా: కిషన్​రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు.. భాజపాకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం కొత్త కాదని కిషన్‌రెడ్డి తెలిపారు.

  • కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించిన భాజపా

తెరాస ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలంటూ భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తోంది. నగదు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీని కోరారు. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చిన భాజపా.. తప్పుడు ఆరోపణలతో భాజపా ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఫిర్యాదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ శనివారానికి వాయిదా పడింది.

  • మంత్రి జగదీశ్​ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు

మంత్రి జగదీశ్​ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. మునుగోడు ఉపఎన్నికలో తెరాస అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అపుతామంటూ మంత్రి ప్రసంగించారన్న భాజపా ఫిర్యాదు ఆధారంగా ఈసీ తాఖీదు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ప్రచారంలో భాగంగా జగదీశ్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.

  • ఎల్​ఐసీ షేర్ హాల్డర్స్​కు గుడ్​న్యూస్.. డివిడెండ్లకు అవకాశం!

స్టాక్​ మార్కెట్​లో ఎల్​ఐసీ షేర్​ పట్ల మదుపరుల్లో నమ్మకాన్ని కలిగించడం, తన మార్కెట్​ విలువను పెంచుకోవడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాలసీ హోల్డర్లకు చెందిన సుమారు రూ.1.81 లక్షల కోట్ల ఫండ్‌ను డివిడెండ్‌ లేదా బోనస్‌ షేర్‌ ఇచ్చేందుకు నిర్ణయించిన ఫండ్‌లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • సికిందర్​ రాజా స్పిన్ మ్యాజిక్​ వెనక ఉన్నది ఇతడేనా?

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు గెలిచిన సికిందర్‌ రజాపై ఫ్యాన్స్​ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్​లో అతడు తన స్పిన్​ మాయాజాలంతో మ్యాచ్​ను మలుపుతిప్పాడు. అయితే ఇలా ఆడగలటానికి గల రహస్యాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే..

  • పాక్​ జట్టుపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్​ జట్టుపై కీలక కామెంట్స్​ చేశారు బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ. అలాగే అద్భుత ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్న పసి కూనలు ఐర్లాండ్​, జింబాబ్వేను ప్రశంసించారు.

  • ఆలీ షోకు గెస్ట్​గా పవన్​ కల్యాణ్​.. నిజమేనా?

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఈ పేరుకు ఉన్న క్రేజ్​ తెలిసిందే. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్​కు పూనకాలే. అయితే ఆయన ఓటీటీలో ప్లాట్​ఫామ్​లో దూసుకుపోతున్న నందమూరి నటసింహం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్​కు వస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరో టాక్​ షోకు వెళ్తారని బుల్లితెరపై సందడి చేస్తారని వినిపిస్తోంది. ఈ విషయాన్ని కమెడియన్​ ఆలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ఓ చిన్న క్లిప్​ సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.

  • ఈ అమాయకపు చూపుల చిన్నారి.. కుర్రాళ్ల కలల రాకుమారి

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్​పై నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో క్యూటీ పిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకపు చూపులతో ఆకట్టుకుంటున్న ఈ లిటిల్ ప్రిన్సెస్​.. ఇప్పుడు హీరోయిన్​. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేడు(అక్టోబర్​ 28) ఆమె పుట్టినరోజు కూడా. గుర్తుపట్టగలరా?

ABOUT THE AUTHOR

...view details