తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - Telangana news in telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS

By

Published : Oct 27, 2022, 8:58 AM IST

  • మొయినాబాద్ ఫామ్ హౌస్​లో మరోసారి పోలీసుల తనిఖీలు

నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్​లో మరోసారి తనిఖీలు నిర్వహించి.. డబ్బుఎక్కడైనా దాచారా అని తనిఖీ చేస్తున్నారు.

  • కథ, స్క్రీన్​ ప్లే, దర్శకత్వం తెరాస.. అంతా గులాబీ నేతలు ఆడుతున్న నాటకం

మొయినాబాద్​ ఉద్ఘటనను.. భాజపా నేతలు ముక్తకంఠంతో కట్టుకథగా కొట్టిపారేశారు. మునుగోడులో ఓడిపోతున్నామని తెరాస ఆడుతున్న నాటకంగా నేతలు అభివర్ణించారు. ఈ ఘటనపై సీబీఐతో కానీ.. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. ఫామ్​ హౌస్​కు వచ్చిన ముగ్గురికి... భాజపాకు ఎటువంటి సంబంధం లేదని నేతలు స్పష్టం చేశారు.

  • నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు.. దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురి అరెస్ట్

అధికార తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది. తెరాస శాసనసభ్యులతో మాట్లాడేందుకు.. పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్​కు వచ్చిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

  • ఆర్టీసీ ఉద్యోగుల వేతనసవరణ ప్రతిపాదన మళ్లీ వెనక్కి.. అదే కారణం

ఆర్టీసీ ఉద్యోగుల వేతనసవరణను అమలు చేయాలన్న ప్రతిపాదనను ఈసీ తిరస్కరించింది. నిర్ధేశిత కమిటీ ద్వారా కాకుండా నేరుగా కార్పొరేషన్, సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన రావడంతో దాన్ని సీఈఓ కార్యాలయం వెనక్కు పంపినట్లు తెలిసింది. 2017లో కార్మికసంఘాలు, ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన ఒప్పందానికి అనుగుణంగా పీఆర్సీ అమలు కోసం ఆర్టీసీ ఎండీ లేఖ రాశారు.

  • తెలంగాణలో తిరిగి ప్రారంభమైన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

తెలంగాణలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల సమయంలో నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. మధ్యలో మక్తల్ పెద్ద చెరువు వద్ద కులనిర్మూలన పోరాట సమితి సభ్యులు, బీడీకార్మికులు, మత్య్సకారులు కలిశారు.

  • గుజరాత్​లో త్రిముఖ పోరు.. దళిత ఓటర్ల దయ ఎటువైపో!

ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్​లో ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాల్లో దళిత ఓటర్లు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే వారంతా ఒకే పార్టీకి గుంపగుత్తగా మొగ్గుచూపిన దాఖలాలు ఇప్పటివరకు దాదాపుగా లేవు. ఈ ఎన్నికల్లో కూడా భాజపా, ఆప్​, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరులో ఎస్సీల ఓట్లు చీలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • విద్యుత్‌ వాహనాల పరుగు.. ఖరీదు ఎక్కువైనా కొనేందుకు మొగ్గు!

ఇంజిన్‌ మోతే లేకుండా విద్యుత్‌ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్‌ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

  • 'టీ20ల నుంచి కోహ్లీ రిటైర్‌ అవ్వాలి.. అలాగైతేనే అది సాధ్యం'

టీ20 ఫార్మాట్‌ నుంచి విరాట్‌ కోహ్లీ రిటైర్‌ కావాలని పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఇందుకు కారణాలను కూడా వెల్లడించాడు.

  • 'డర్టీబాంబు' అంటే ఏంటి?.. ఎప్పుడైనా ప్రయోగించారా? ప్రాణ ముప్పు తప్పదా?

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా ఎక్కువగా వినిపిస్తున్న పదం డర్టీబాంబు. ఇరుదేశాలు ఈ బాంబును సిద్ధం చేసుకుంటున్నాయని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అసలేంటీ డర్టీబాంబు? గతంలో ఎప్పుడైనా ఈ బాంబును ప్రయోగించారా?

  • 'సరైన కథలు దొరికితే.. సత్తా చూపిస్తాం'

ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలే చేయాలనుకుంటున్నా అంటోంది ఓ హీరోయిన్​. ఇప్పటి దాకా కమర్షియల్‌ చిత్రాలే చేశా.. ఇకపై నటిగా సవాల్‌ విసిరే పాత్రలతోనే ప్రయాణించాలనుకుంటున్నా అని చెబుతోంది మరో భామ. అవకాశాలు దక్కినా.. అనుకోని కారణాల వల్ల సినిమాలు ఆగి డైరీ ఖాళీ అయినవాళ్లు కొందరు.

ABOUT THE AUTHOR

...view details