రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమల్లో లేవని... తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వ్యక్తి సీఎం కేసిఆర్ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
'అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్' - Minister Mallareddy Kcr Birthday Celebrations
అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
Minister Mallareddy
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ చేసిన పోరాటాలను, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను వివరిస్తూ గీసిన చిత్రాలను ఇందులో ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు అంటే రాష్ట్ర ప్రజలకు ఒక పండుగలాంటిదని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు.
ఇదీ చదవండి: 'గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్'