తెలంగాణ

telangana

ETV Bharat / state

Registration fees:రిజిస్ట్రేషన్‌ ఫీజులు, వినియోగ ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి.. - telangana varthalu

స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ మరోసారి ఫీజుల మోత మోగించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల(registration fees)తో పాటు సేవల ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ, చిట్ ఫండ్(chitfund) కంపెనీల రిజిస్ట్రేషన్ ఛార్జీలపైనా భారీగా వడ్డించారు. పెరిగిన కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని సర్కార్‌ స్పష్టం చేసింది.

Registration fees:రిజిస్ట్రేషన్‌ ఫీజులు, వినియోగ ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..
Registration fees:రిజిస్ట్రేషన్‌ ఫీజులు, వినియోగ ఛార్జీల పెంపు.. నేటి నుంచే అమల్లోకి..

By

Published : Sep 2, 2021, 4:50 AM IST

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఫీజుల(registration fees)తో పాటు వినియోగ ఛార్జీలు, ఆ శాఖ ద్వారా అందించే వివిధ సేవల రుసుములను ప్రభుత్వం పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు, చిట్‌ఫండ్‌లకు సంబంధించిన ఛార్జీలను పెంచింది. పెరిగిన రుసుములు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందించే వివిధ సేవల ఫీజులను భారీగా పెంచింది. రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకారం కుటుంబసభ్యులంటే ఎవరో వివరించింది.

గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.500 ఉండగా తాజాగా ఇది రూ.2 వేలకు పెరిగింది. సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్‌కు గతంలో రూ300 ఉన్న మొత్తాన్ని తాజాగా రూ.1000కి పెంచారు. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా తాజాగా దీనికి కనిష్ఠం రూ.5000గా గరిష్ఠంగా లక్ష రూపాయలు నిర్ణయించారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్‌ చేసే రుసుం గతంలో వెయ్యి రూపాయలు ఉండగా రూ.10000కు పెరిగింది. ఐదుగురు కుటుంబ సభ్యులకంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి అదనపు సభ్యుడికి మరో రూ.1000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 75 ఏళ్ల పైబడి వృద్ధులకు ప్రైవేటీ అటెండన్సీ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించింది. సర్టిఫైడ్‌ కాపీ, ఈసీలకు గతంలో రూ.200 ఉండగా ఇది రూ.500కు పెరిగింది. సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్‌కు ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించింది. వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలు, వీలునామావిచారణ, వీలునామా సీల్డు కవర్‌ డిపాజిట్‌, వీలునామా సీలు తెరవడం వంటి వాటికి రుసుమును రూ.5 వేలుగా పేర్కొన్నారు.

కుటుంబసభ్యులు అంటే వీళ్లే

తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అవ్వ, మనుమలు, దత్తత తీసుకున్న కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి.

పెరిగిన ఫీజుల వివరాలు:

ఇదీ చదవండి: HUZURABAD BY ELECTION: రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం.. హుజూరాబాద్​ ఉపఎన్నిక అప్పుడే!

ABOUT THE AUTHOR

...view details