తెలంగాణ

telangana

Telangana TET Results 2023 : తెలంగాణ టెట్​ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 9:59 AM IST

Updated : Sep 27, 2023, 10:58 AM IST

Telangana TET Results 2023 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు అధికార వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయని టెట్​ కన్వీనర్​ రాధారెడ్డి వెల్లడించారు.

TET Results in Telangana Website
TET Results in Telangana

Telangana TET Results 2023: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు కాసేపట్లో విడుదలయ్యాయి. ఉదయం పది గంటల నుంచి అధికార వెబ్​సైట్ tstet.cgg.gov.in​లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి(TET Convenor Radha Reddy) తెలిపారు. ఇటీవలే ప్రాథమిక కీని విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న 1139 కేంద్రాల్లో జరిగిన టెట్​ పేపర్-1కు 2 లక్షల 26 వేల 744 మంది.. పేపర్-2కు లక్ష 89 వేల 963 మంది హాజరయ్యారు. విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్​లో అర్హత సాధించాలి.

ఫలితాలను కింది విధంగా చెక్​ చేసుకోండి:

step : 1 అధికార వెబ్​సైట్tstet.cgg.gov.in ని క్లిక్​ చెయ్యండి

step : 2 వెబ్​సైట్​ హోం పేజ్​ ఓపెన్​ అవుతుంది. అందులో చివరి బాక్స్​లో డౌన్​లోడ్​ టీఎస్​ రిజల్ట్స్​- టీఎస్​ టెట్​ 2023 ఉంటుంది.

step : 3 Download Results ఆప్షన్​ క్లిక్​ చెయ్యాలి

Step : 4 హాల్​టికెట్​ నంబర్ అడుగుతుంది. మీ Hall TICKET Number ఎంటర్​ చేయాలి

Step : 5 Get Results ఆప్షన్​ క్లిక్​ చేస్తే మీ మార్కులు తెలుసుకోవచ్చు.

Step : 6 చివరిలో మీ మార్కులను ప్రింట్​ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా టెట్‌ నిర్వహణ.. భారీగా హాజరుశాతం నమోదు

TET Results Telangana Today: రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని టెట్​లు కలిపి పేపర్-1లో లక్షన్నర.. పేపర్-2లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో చివరగా 2022 జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్​-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

ఉపాధ్యాయ నియామకాల కోసం రాష్ట్రంలో 5000పైగా ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. అప్లికేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్​, పరీక్ష సన్నద్ధం అయేందుకు గడువు కావాలని డీఎస్సీ అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష(Teacher Recruitment Test).. టీఆర్టీ జరగనుంది.

Telangana TET Exam 2023 : నేడే ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. ఆ విద్యా సంస్థలకు సెలవు

Telangana TeT Notification 2023 : టెట్‌ పరీక్ష దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు

TET Exam Telangana 2023 : రేపే 'టెట్'​ పరీక్ష.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

Last Updated : Sep 27, 2023, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details