Telangana TET Exam 2023 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ నేడు జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పేపర్ 1కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ 2.. 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది.
TET Exam Telangana 2023 : 'టెట్' పరీక్ష.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
TS TET 2023 Exam : పరీక్ష కోసం 2 వేల 52 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. సీసీ కెమెరాలు, ఫర్నీచర్, నిరంతర విద్యుత్ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆర్టీసీ బస్సు సదుపాయం, బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను, ఆర్టీసీ, పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించబోమని టెట్ కన్వీనర్ రాధారాణి స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలని తెలిపారు. ఈ నెల 27న టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు.
టెట్ పేపర్ లీక్- అభ్యర్థులు సెంటర్కు వచ్చాక పరీక్ష రద్దు
TET Exam Telangana 2023 : జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం.. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని టెట్‌లు కలిపి పేపర్ 1లో లక్షన్నర.. పేపర్ 2 లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో చివరగా గతేడాది జూన్ 12నవిద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ అర్హత కాల పరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్ 1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. గతేడాది జూన్ 12న జరిగిన టెట్ పేపర్ 1లో లక్ష 4 వేల 78 మంది.. పేపర్ 2లో లక్ష 24 వేల 535 మంది అర్హత సాధించారు.
Telangana TET2023 Hall Tickets Released : టెట్ హాల్ టికెట్లు విడుదల..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జూన్.. 2012 జనవరి, జూన్, 2014 మార్చిలో టెట్ నిర్వహించగా.. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత 2016 మే, 2017 జులై, గతేడాది జూన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. మరోవైపు.. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష... టీఆర్టీ జరగనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబరు 21 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి