Telangana TET 2023 Hall Tickets Released : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) (Telangana Tet 2023) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. tstet.cgg.gov.inలో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 9 నుంచి 14వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ 040-23120340, 040-23120433 నంబర్లను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
TET SA Exam: టెట్ ఎస్‌ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం
TS TET 2023 :సెప్టెంబరు 15న టెట్ పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు. పేపర్-1 ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ఫలితాలు సెప్టెంబరు 27న విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
Telangana TET 2023 :ఇటీవలే టెట్‌నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. వాటిలో పేపర్-1కు 2.70 లక్షలు, పేపర్-2కు 2.08 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తు గడువు ఆగస్టు 17న అర్ధరాత్రి 12:00 గంటలకు ముగిసిందని.. గతేడాది (మొత్తం 6.28 లక్షలు)తో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య లక్షన్నర వరకు తగ్గిందని అధికారులు వివరించారు.
దరఖాస్తులు ఇలా..
- పేపర్-1: 2,69,557
- పేపర్-2: 2,08,498
- రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు: 1,86,997
- పోటీపడే అభ్యర్థుల మొత్తం సంఖ్య: 2,91,058