తెలంగాణ టెక్నికల్ కాలేజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉద్యోగులు.. ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే జీతాలు చెల్లించేలా యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు.
జీతాలు చెల్లించడం లేదని ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
ప్రైవేటు కళాశాలలు తమకు జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఉద్యోగులు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జీతాలు చెల్లించడం లేదని ప్రగతి భవన్ ముట్టడికి యత్నం
ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం వత్తాసు పలకడంతోనే వాళ్లు వేతనాలు చెల్లించడంలేదని ఉద్యోగులు విమర్శించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.