కోవిడ్-19కు వ్యతిరేకంగా కేరళ పాటించిన పద్ధతులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ వైద్య బృందం కేరళలో పర్యటించింది. కరోనాను ఎదుర్కునేందుకు కేరళ అనుసరించిన పద్ధతులు, నివారణకు తీసుకున్న చర్యలపై కేరళ ఆరోగ్య మంత్రి కే.కే.శైలజతో వైద్య బృందం సమీక్షించింది.
కేరళను స్ఫూర్తిగా తీసుకుంటాము: రాష్ట్ర వైద్య బృందం - Telangana team went Kerala to study Kerala model of resisting corona virus
కోవిడ్-19ను నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్య బృందం కేరళ వెళ్లింది. అక్కడి వైద్య శాఖ మంత్రి కేకే శైలజతో సమీక్షించి... కరోనా అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుంది.

కేరళను స్ఫూర్తిగా తీసుకుంటాము: రాష్ట్ర వైద్య బృందం
కేరళలో మోడల్ ప్రక్రియను రాష్ట్రంలోనూ అనుసరించనున్నట్లు వైద్య బృందం తెలిపింది. వైరస్‌కు వ్యతిరేకంగా సమర్ధవంతమైన కార్యాచరణ ప్రణాళికను కేరళ అనుసరించడంపట్ల డబ్ల్యూహెచ్ఓ, ఐక్యరాజ్యసమితి హర్షం వ్యక్తం చేసిందని అక్కడి అధికారులు వివరించారు.
కేరళను స్ఫూర్తిగా తీసుకుంటాము: రాష్ట్ర వైద్య బృందం
ఇదీ చదవండి:ట్రాఫిక్ ఉల్లంఘనలతో బస్సు యజమానికి రూ.6.7 లక్షల ఫైన్