Telangana Tax Revenue Till October 2023 : అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్రానికి దాదాపు లక్షకోట్ల వరకుఆదాయం సమకూరింది. పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాల్లో సగానికి పైగా వచ్చింది. పన్నేతర ఆదాయం 81 శాతానికి పైగా రాగా గ్రాంట్లు మాత్రం కేవలం తొమ్మిది శాతానికి పైగానే ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఖజానాకు రూ.లక్షా 33 వేల కోట్ల ఆదాయం రాగా రూ.లక్షా 28 కోట్లు ఖర్చు చేసింది.
కేంద్రం నుంచి మళ్లీ నిరాశే.. నాలుగు శాతం కూడా రాని గ్రాంట్లు
ఆర్థిక సంవత్సరం మొదటి నెలల్లో అంటే అక్టోబర్ నెల ముగిసే నాటికి రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం రూ.77,382 కోట్లు సమకూరింది. బడ్జెట్ అంచనా రూ.1,52,499 కోట్లలో ఇది 50.74 శాతంగా ఉంది. జీఎస్టీ ద్వారా రూ.26,407 కోట్లు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,227 కోట్లు సమకూరాయి. అమ్మకం పన్ను ద్వారా రూ.17,334, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.13,695 కోట్లు సర్కార్కు వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.7,139 కోట్లు రాగా ఇతర పన్నుల రూపంలో మరో రూ.4,576 కోట్లు సమకూరాయి.
Telangana Non-tax income till October 2023 : పన్నేతర ఆదాయం విషయానికి వస్తే బడ్జెట్లో రూ.22,808 కోట్లు అంచనా వేయగా అక్టోబర్ చివరి వరకు అందులో 81.36 శాతం అంటే రూ.18,556 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఈ ఏడాది 41,259 కోట్లు వస్తాయనిబడ్జెట్లో పేర్కొనగా మొదటి ఏడు నెలల్లో అందులో కేవలం రూ.3835 కోట్లు అంటే 9.3 శాతం మాత్రమే సమకూరాయి. మొత్తం మీద ఖజానాకు వచ్చిన రెవెన్యూ రాబడులు రూ.99,775 కోట్లు.
ఆర్నెళ్లలో తెలంగాణ ఖజానాకు పన్ను ఆదాయం 66 వేల కోట్లు
బడ్జెట్ అంచనా రాబడిలో రూ.2,16,566 కోట్లలో ఇది 46.07 శాతంగా ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా రూ.33,378 కోట్ల రూపాయలు సమకూర్చుకొంది. బడ్జెట్లో పేర్కొన్న రూ.38,234 కోట్లలో ఇది 87.3 శాతం. అన్ని రకాలుగా ఏడు నెలలు ముగిసే నాటికి రాష్ట్ర ఖజానాకు రూ.1,33,174 కోట్లు సమకూరాయి.
Telangana Tax Revenue Increased : 4 నెలల్లో.. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 42,712 కోట్లు
బడ్జెట్ అంచనా ఖర్చుల్లో రూ.2,59,861 కోట్లలో ఇది 51.25 శాతంగా ఉంది. అందులో సర్కార్ రూ.1,28,553 కోట్లు ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయం రూ.1,02,358 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.26,195 కోట్లు. సాధారణ రంగంపై రూ.31,096 కోట్లు, సామాజిక రంగంపై రూ.38,497 కోట్లు, ఆర్థికరంగంపై రూ.58,959 కోట్లు ఖర్చు చేసింది.
Telangana Interest payments :వడ్డీ చెల్లింపుల కోసం రూ.12,956, వేతనాల కోసం రూ.23,391, పెన్షన్ల కోసం రూ.9,933, రాయతీలపై రూ.4,431 కోట్లు ఖర్చు చేసింది. పన్ను ఆదాయం ఆగస్టు నెల నుంచి తగ్గుతూ వస్తోంది. ఆగస్టులో రూ.12,729, సెప్టెంబర్లో రూ.11,249, అక్టోబర్లో రూ.10,691 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం అక్టోబర్ నెలలో రూ.1,660 కోట్లు వచ్చాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో అక్టోబర్లో కేవలం రూ.216 కోట్లు సమకూరాయి. అప్పుల విషయం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలలోనే తక్కువ మొత్తంలో రూ.2,044 కోట్లు తీసుకున్నారు.రెవెన్యూ వ్యయం కూడా అక్టోబర్లో రూ.4,418 కోట్లకు తగ్గింది.
TS Stamps and Registrations Revenue : రాష్ట్ర ఖజానాకు ఎదురుగాలి.. ఆశించిన మేర లేని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం