తెలంగాణ

telangana

ETV Bharat / state

మణిపుర్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు - Manipur Clashes

Manipur
Manipur

By

Published : May 8, 2023, 1:48 PM IST

Updated : May 8, 2023, 3:34 PM IST

13:45 May 08

మణిపుర్‌ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ విద్యార్థులు

Telangana students reached Hyd from Manipur: మణిపుర్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్థులను మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చింది. విమానాశ్రయంలో విద్యార్థులకు స్థానికి ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారిని ప్రత్యేక బస్సుల్లో వారి స్వస్థాలాలకు వెళ్లడానికి తగు ఏర్పాట్లు చేశారు. తొలుత ఆదివారం సాయంత్రానికి వారిని తీసుకురావాల్సి ఉండగా.. అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇవాళ తీసుకొచ్చారు.

మణిపుర్‌లో అల్లర్లు, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో అక్కడి ఐఐటీతో పాటు ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం శనివారమే అప్రమత్తమైంది. బాధితుల సహాయార్థం దిల్లీలోని తెలంగాణభవన్‌తో పాటు హైదరాబాద్‌లోనూ ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లు మణిపుర్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకొనేవారు. విద్యార్థులతో పాటు తెలంగాణవాసులు సుమారు 250 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిని తరలించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానాన్ని పంపి ఇవాళ మధ్యాహ్నానికి క్షేమంగా తీసుకొచ్చారు.

భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూస్తాం:మణిపూర్ నుంచి​ విద్యార్థులు శంషాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి విమానాశ్రయానికి వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విద్యార్థులను ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ తీసుకొచ్చామని తెలిపారు. వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల చదువులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మణిపుర్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి రాకపోతే వాళ్ల చదువులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే ఏదో ఒక ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి భరోసా ఇచ్చారు.

మణిపుర్​లో తాజా పరిస్థితులను విద్యార్థులు మీడియాతో పంచుకున్నారు. అక్కడి అల్లర్లులతో చాలా ఇబ్బంది పడినట్లు వివరించారు. వసతి గృహాలోనే ఇన్ని రోజులు బిక్కుబిక్కుమంటు తల దాచుకున్నామని గుర్తు చేసుకున్నారు. తమను క్షేమంగా తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 8, 2023, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details