దేశ అత్యున్నత పరీక్ష సివిల్స్ - 2018 తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పరీక్షలో సత్తా చాటారు. దాదాపు 75 మంది ఇంటర్య్వూ హాజరుకాగా చివరకు 40 మంది విజేతలుగా నిలిచారు. గతేడాది కంటే ఈసారి ఖాళీల సంఖ్య తగ్గడం వల్ల ప్రధాన పరీక్షకు హాజరైన వారి సంఖ్య కూడా తగ్గింది.
వరుణ్‌రెడ్డికి ఏడో ర్యాంకు
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. నాలుగు సార్లు విఫలమైనా పట్టు వదలకుండా ప్రయత్నించి ఐదో సారి విజయం సాధించారు. అదే విధంగా నాగర్ కర్నూల్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ అఖిల భారత స్థాయిలో 57వ ర్యాంకుతో సత్తా చాటారు.
రైతు బిడ్డకు 131వ ర్యాంకు
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ జాతీయ స్థాయిలో 131వ ర్యాంకు సాధించారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఏడాది కాలంగా ఇంటి వద్దనే ఉంటూ రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యారు.
రెండో ప్రయత్నంలోనే..
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివిన సిరి మేఘన బీటెక్ చివరి సంవత్సరంలో ఐఏఎస్ కావాలనే సంకల్పంతో కష్టపడి చదివారు. తన రెండో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 171వ ర్యాంకు సాధించారు. అలాగే భాగ్యనగరంలో విద్యను పూర్తి చేసిన శివ నిహారిక 237వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన బాణోతు మృగేందర్ లాల్ 551వ ర్యాంకు సాధించారు. ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు ఇదీ చదవండి :సివిల్స్‌లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు