Telangana Student Committed Suicide in IIT Kharagpur : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో (IIT Kharagpur) ప్రాజెక్టు ఒత్తిడి భరించలేక.. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మెదక్ జిల్లా తూప్రాన్ చెందిన కిరణ్‌చంద్రగా (Kiran Chandra) పోలీసులు గుర్తించారు. కిరణ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. కిరణ్ సోదరుడు కూడా అక్కడే చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం
Kiran Chandra Committed suicide at IIT Kharagpur : ఈ ఘటన జరిగిన సమయంలో అతను కూడా హాస్టల్‌లోనే ఉన్నాడని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ముగ్గురు విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అసోం నివాసి ఫైజాన్ అహ్మద్ గతేడాది మృతిచెందాడు.
Couple Suicide in Peddapalli : ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఆ పసిబిడ్డలకు దిక్కెవరు?
అసోం నివాసి ఫైజాన్ అహ్మద్ మృతిపై పోలీసులు వాస్తవాలనే కప్పిపుచ్చారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత దీనిపై విచారణ జరిపిన.. కోల్కత్తా హైకోర్టు.. ప్రత్యేక వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండోసారి ఫైజాన్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. వైద్యులు ఈ నివేదికను.. న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నివేదికపై స్పందించిన కోల్‌కతా హైకోర్టు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఎస్.జయరామ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. గత జూన్‌లో కూడా ఐఐటీ హాస్టల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు.