తెలంగాణ

telangana

ETV Bharat / state

2,561 కేసుల కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్​ - రాష్ట్ర స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్ష హైదరాబాద్​

పెండింగ్​లో ఉన్న 2,561 ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. సవరించిన చట్టం ప్రకారం 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి సంబంధిత అధికారి న్యాయస్థానంలో ఛార్జ్ ​షీట్ దాఖలు చేయాలన్నారు. ఛార్జ్ షీట్, సాక్షాల సమర్పణలో నిర్లక్ష్యం వహించిన పోలిసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

2,561 కేసుల కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్​
2,561 కేసుల కారణాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్​

By

Published : Nov 5, 2020, 7:35 PM IST

పెండింగ్​లో ఉన్న 2,561 ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన హైదరాబాద్ సంక్షేమభవన్​లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్, ఆయా శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

సవరించిన చట్టం ప్రకారం 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి సంబంధిత అధికారి న్యాయస్థానంలో ఛార్జ్ ​షీట్ దాఖలు చేయాలని ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్​ పేర్కొన్నారు. 2018 నుంచి 2020 ఆగస్టు వరకు నిర్దోషులుగా తేలిన కేసుల్లో అవకాశం ఉంటే అప్పీల్​కు వెళ్లాలని సూచించారు. ఛార్జ్ షీట్, సాక్షాల సమర్పణలో నిర్లక్ష్యం వహించిన పోలిసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

చట్టప్రకారం వారంలో ఒకరోజు తహసీల్దార్​, ఎంపీడీవో, సర్పంచ్, సోషల్ వెల్ఫేర్ అధికారితో కలిసి ఎస్సైకి తక్కువ హోదా కానీ అధికారి ఒక గ్రామంలో సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాల్లో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని.. ఎక్కువగా భూసంబంధ సమస్యలు, ఫిర్యాదులు వస్తున్నందున రెవెన్యూ అధికారులను కూడా భాగస్వామ్యం చేయాలని శ్రీనివాస్​ చెప్పారు.

కమిషన్ చొరవతో బాధితులకు దేశంలోనే అధికంగా ఆగస్టు నెలాఖరు వరకు రూ. 54 కోట్లు అందించామని.. నిధుల విడుదల ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని ఛైర్మన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు పరిశోధనా కేంద్రం అవసరమని.. మంత్రులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి పోలిస్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్రస్థాయి పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం జరగాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, భద్రతకు సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది: కేటీఆర్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details