రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల వేతనాలలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ అనైతికమని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.సదానందం గౌడ్, యం.పర్వతరెడ్డిలు ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా పేర్కొంటున్న ప్రభుత్వం... దేశంలో ఎక్కడాలేని విధంగా.. వేతనాలు, పింఛనులో కోత విధించడం అన్యాయమన్నారు.
రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ అనైతికం: ఎస్టీయూ
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోతపై హైకోర్టులో వ్యాజ్యం కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికే రాత్రే ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేయటం అనైతికమని ఉపాధ్యాయ సంఘం ఆరోపించింది. ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ జారీ అనైతికం: ఎస్టీయూ
కేవలం వేతనంపై ఆధారపడి జీవించే వేతన జీవుల ఉసురు పోసుకునే విధంగా అకస్మాత్తుగా ఆర్డినెన్స్ జారీచేయడం దుర్మార్గమైనదని మండిపడ్డారు. వెంటనే ఆర్డినెన్సును ఉపసంహరించుకొని జూన్ నెల నుంచి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. అలాగే మార్చి, ఏప్రిల్, మే మినహాయించిన వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.