రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన తెలంగాణ గణాంక సంకలనం-2020 పుస్తకాన్ని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన జీఎస్డీపీ అంచనాలు, ప్రభుత్వ పథకాలు, పలు సర్వే గణాంకాలను వెల్లడించారు. గణాంక సంకలనంలో రైతుబంధు, రైతుబీమా వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2020 వానాకాలంలో రైతుబంధు కింద 57 లక్షల 81 వేల 888 మంది రైతులకు 7 వేల 270 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్లు వివరించారు. లబ్ధిదారుల్లో బీసీలు 53 శాతం, ఎస్సీ, ఎస్టీలు 13 శాతం, ఇతరులు 21శాతంగా ఉన్నట్లు వివరించారు. నల్గొండ జిల్లా రైతులకు అత్యధికంగా రైతుబంధు సాయం అందగా.. మేడ్చల్‌లో అతితక్కువ సాయం అందింది.
897 రైతు కుటుంబాలకు..
రైతుబీమా కింద 2018-19, 2019-20లో 36 వేల 897 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున.. మెుత్తం 1,844 కోట్ల పరిహరం అందించారు. పరిహారం పొందిన రైతుల్లో బీసీలు 51శాతం, ఎస్సీలు 19 శాతం , ఎస్టీలు 14 శాతం, మైనార్టీలు ఒక శాతం, ఇతరులు 15 శాతం ఉన్నారు. రైతుబీమా పరిహారం ఎక్కువగా వచ్చిన జిల్లాల్లోనూ నల్గొండ మొదటి స్థానంలో నిలిచింది.