తెలంగాణ

telangana

ETV Bharat / state

security commission: రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్​, పోలీస్ ఫిర్యాదుల అథారిటీ ఏర్పాటు - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్​, పోలీసు ఫిర్యాదుల అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సుప్రీం, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సెక్యూరిటీ కమిషన్​కు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎక్స్​అఫిషియో ఛైర్మగా వ్యవహరిస్తారు. పోలీసుల ఫిర్యాదుల అథారిటీకి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విలాస్ ఆఫ్జుల్ పుర్కర్.. ఛైర్మన్​గా నియమితులయ్యారు.

telangana State Security Commission
telangana State Security Commission

By

Published : Jul 9, 2021, 5:51 AM IST

సుప్రీం, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్​ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​కు రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎక్స్ అఫిషియో ఛైర్మన్​గా వ్యవహరిస్తారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం జ్యుడీషియల్ సభ్యులు ఎన్.ఆనందరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. డీజీపీ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా ఉంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య తిరుపతిరావు, పాత్రికేయుడు కే. శ్రీనివాసరెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించారు.

పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఏర్పాటు..

పోలీస్ ఫిర్యాదుల అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విలాస్ ఆఫ్జుల్ పుర్కర్.. ఛైర్మన్​గా నియమితులయ్యారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి నవీన్​చంద్​ను అథారిటీ సభ్యునిగా నియమించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

హైదరాబాద్​ రీజియన్​..

హైదరాబాద్ రీజియన్ పోలీస్ ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్​గా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కె.సంగారెడ్డిని నియమించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏ.వెంకటేశ్వర్​రావు సభ్యునిగా నియమించారు. పశ్చిమ మండలం ఐజీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

వరంగర్​ రీజియన్​..

వరంగల్ రీజియన్ పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్​గా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఎం.వెంకట రామారావును నియమించారు. వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ జే.లక్ష్మీనారాయణను సభ్యునిగా నియమించారు. ఉత్తర మండల ఐజీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీచూడండి:ఎన్​కౌంటర్​లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details