గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు దగ్గరకు తీసుకెళ్లడంలో సర్పంచులే కీలక పాత్ర పోషిస్తారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అభిప్రాయపడింది. తమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చర్చలు జరపాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్కని వెంకటేష్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి గెలిచిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. సైదిరెడ్డి గెలుపులో సర్పంచులే కీలకభూమిక వహించారని... ఒక ఎమ్మెల్యేను గెలిపించే సత్తా, ఓడించే సత్తా తమకు ఉందని వెంకటేష్ యాదవ్ అన్నారు. చెక్ పవర్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు ముఖ్యమంత్రికి గాని, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ వ్యతిరేకం కాదన్నారు. గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని చక్కని వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు.
'ఎమ్మెల్యేను ఓడించాలన్నా, గెలిపించాలన్నా సర్పంచులే' - తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం
ఒక ఎమ్మెల్యేను గెలిపించే సత్తా, ఓడించే సత్తా సర్పంచులకు ఉందని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్నారు. చెక్ పవర్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

'ఎమ్మెల్యేను ఓడించాలన్నా, గెలిపించాలన్నా సర్పంచులే'
'ఎమ్మెల్యేను ఓడించాలన్నా, గెలిపించాలన్నా సర్పంచులే'