RTC Special buses from Hyderabad to Medaram Jatara : మేడారం సమక్క-సారలమ్మ మహాజాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి మేడారం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు మేడారం ప్రత్యేక బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమ్మక్క జాతర స్పెషల్ బస్సులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్, నేరేడ్ మెట్, జగద్గిరిగుట్ట, లింగంపల్లి, కేపీహెచ్బీ, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరి... ఉప్పల్లోని వరంగల్ పాయింట్ మీదుగా నడుస్తాయని వివరించారు.
ఆర్టీసీ ప్రయాణం సురక్షితం
Sammakka jatara 2022: మేడారం గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు వెళ్తాయని... సుశిక్షితులైన డ్రైవర్ల పర్యవేక్షణలో బస్సులను నడుపుతామని చెప్పారు. ప్రయాణం సురక్షితమని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈనెల 13వ తేదీన 39 బస్సులు, 14న 48, 15వ తారీఖున 94, 16న 167, 17న 132, 18న 138, 19న 68, 20వ నాలుగైదు బస్సులు.. ఇలా మొత్తం 680 బస్సులను నడిపించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు www.tsrtconline.in ద్వారా కానీ, సమీప ఏజెంట్ల వద్ద కానీ, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లలో కూడా సీట్లను బుక్ చేసుకోవచ్చునని తెలిపారు.