తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2020, 6:02 AM IST

Updated : Mar 14, 2020, 8:03 AM IST

ETV Bharat / state

ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రానికి పురస్కారం

ఏరోస్పేస్ పరిశ్రమ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న రాష్ట్రంగా.. తెలంగాణ ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు, ఎఫ్​ఐసీసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

telangana-state-revived-award
ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రానికి అవార్డు

ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రానికి అవార్డు

సివిల్ ఏవియేషన్ రంగంలో ఉత్తమంగా రాణించిన ప్లేయర్స్​కు వింగ్స్ ఇండియా ఏవియేషన్ అవార్డును మంత్రి కేటీఆర్ అందజేశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు, ఎఫ్​ఐసీసీఐ ప్రతినిధులు హాజరయ్యారు.

ఏరోస్పేస్ పరిశ్రమ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తోన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ విమానాశ్రయ విభాగంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యావరణం, సుస్థిర ఏవియేషన్ విభాగంలో రాణిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఉత్తమ ఉడాన్ ఎయిర్​ పోర్ట్​గా హుబ్బలి విమానాశ్రయం పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ దేశీయ ఎయిర్​లైన్ విభాగంలో విస్తారా.. అవార్డు గెలుచుకుంది.

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Last Updated : Mar 14, 2020, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details