తెలంగాణ

telangana

ETV Bharat / state

'గడ్డిని పొలాల్లోనే కాల్చకుండా ప్రత్యామ్నాయాలు చూపించాలి' - తెలంగాణ వ్యవసాయ వార్తలు

వరి కోత అనంతరం గడ్డిని పొలాల్లోనే కాల్చివేయటం వల్ల కాలుష్యం పెరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. ఈ విషయంలో రైతులకు ప్రత్యామ్నాయాలు చూపించాలని కోరారు.

IEITSC conference
'గడ్డిని పొలాల్లోనే కాల్చకుండా ప్రత్యామ్నాయాలు చూపించాలి'

By

Published : Jun 22, 2020, 8:08 PM IST

'వరి మిగులు నిర్వహణకు సంబంధించిన పరిష్కారాలు' అనే అంశంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ శాఖ వెబ్​కాన్ఫరెన్స్​ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా... గడ్డిని పంట పొలాల్లోనే కాల్చడం వల్ల కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని వినోద్​కుమార్​ పేర్కొన్నారు.

పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో కోత అనంతరం గడ్డిని కాల్చటం వల్ల దిల్లీలో కాలుష్య సమస్య ఉత్పన్నమవుతోందని ఆయన వివరించారు. గడ్డి, కొయ్యకాళ్లను హైదరాబాద్​లోని ఫార్మా కంపెనీలలో వివిధ అవసరాలకు ఉపయోగించవచ్చని కాన్ఫరెన్స్​కు హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. పశువుల కోసం దాణాగా ఉపయోగించే సైలేజ్, అట్టల తయారీ, బయో ఫెర్టిలైజర్స్ తదితరాల్లో అవకాశాలు పరిశీలించాని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనాతో ఉపాధి కోల్పోయిన 20 లక్షల మంది!

ABOUT THE AUTHOR

...view details