రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరహార దీక్షలు చేపడుతున్న చేనేత కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబురావు విజ్ఞప్తి చేశారు. ఉపాధి లేక మూడు నెలలుగా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
'చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి' - తెలంగాణలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావు అన్నారు. కరోనా నేపథ్యంలో చేనేత కార్మికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'చేనేత కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి'
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై రుణాలివ్వాలని కోరారు. చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి... కార్మికుల కుటుంబానికి నెలకు ఎనిమిది వేల రూపాయలు అందించాలన్నారు. ఒక్కో కార్పొరేషన్‌కు వెయ్యికోట్ల నిధులు కేటాయించాలన్నారు.
ఇదీ చూడండి:సన్నాహక సమావేశాలు.. కార్యకర్తలకు దిశా నిర్దేశాలు!