తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం

కరోనా వైరస్​ సోకిన జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ అన్ని విధాల అండగా ఉంటుందని ఛైర్మన్​ అల్లం నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా సోకిన పాత్రికేయులకు ఇప్పటి వరకు మొత్తం రూ. 3 లక్షల 10 వేలను ఆర్థికసాయంగా అందించినట్లు ఆయన వెల్లడించారు.

Telangana State Media Academy Chairman Allam Narayana finances journalists infected with corona virus
కరోనా పాజిటివ్​ వచ్చిన జర్నలిస్టులకు ఆర్థికసాయం

By

Published : Jun 3, 2020, 10:10 PM IST

హైదరాబాద్​లో మరో ముగ్గురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా వచ్చిన పాత్రికేయులకు ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 10 వేల రూపాయలను అకాడమీ నిధుల నుంచి అందించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

ఇళ్ల నుంచి బయటికి వెళ్లే సందర్భంలో... జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్​ను వాడాలని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కలిగించటంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ జర్నలిస్టులకు అన్ని విధాల అండగా ఉంటుందని వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details