తెలంగాణ

telangana

ETV Bharat / state

త్రిషకు మంత్రి కేటీఆర్ అభినందనలు - క్రికెటర్ త్రిష అండర్ 19

మంత్రి కేటీఆర్.. ప్రతిభను ప్రోత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఐసీసీ విమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ బిడ్డ త్రిష.. మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆమె ఆట తీరును చూసిన కేటీఆర్... ఫిదా అయ్యారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

Telangana State IT Minister KTR congratulates to Under19 Cricket Women World Cup winner Trisha
మొక్క నాటిన త్రిష.. అభినందనలు చెప్పిన మంత్రి కేటీఆర్

By

Published : Feb 8, 2023, 7:36 PM IST

త్రిషకు మంత్రి కేటీఆర్ అభినందనలు

ఐసీసీ విమెన్స్ అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో ముఖ్య సభ్యురాలు మన తెలంగాణకు చెందిన త్రిష అనే విషయం తెలిసిందే. కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ త్రిషకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. తండ్రి గొంగిడి రామిరెడ్డితో కలిసి త్రిష మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

మొక్క నాటిన క్రికెటర్ త్రిష

ఈ సందర్భంగా కేటీఆర్‌... త్రిష ఆట తీరును ప్రశంసించారు. అలాగే బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు మాజీ ఫీల్డింగ్‌ కోచ్ ఆర్‌.శ్రీధర్‌తో కలిసి యువ క్రికెటర్‌ త్రిష ఈస్ట్‌ మారేడుపల్లిలోని కోచింగ్‌ బియాండ్‌ క్రికెట్‌ అకాడమీలో మొక్క నాటారు.

మొక్క నాటిన క్రికెటర్ త్రిష

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో త్రిష 24 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి, విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక త్రిష స్వస్థలం భద్రాచలం. ఆమె తండ్రి రామిరెడ్డి స్వతహాగా క్రీడాకారుడు. అండర్-16లో రాష్ట్ర హాకీ జట్టులో సభ్యుడైన ఆయన క్రికెట్ కూడా ఆడేవారు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడటం మీద దృష్టి సారించిన ఆయన ఐటీసీ జిమ్ ట్రైనర్‌గా ఉద్యోగం చేస్తూ.. సొంతంగా జిమ్ నడిపేవారు. క్రీడాకారుడైన రామిరెడ్డి.. తన కూతుర్ని క్రికెటర్ చేయాలని ఆకాంక్షించారు. రెండున్నరేళ్ల వయసు నుంచే తనకు క్రికెట్‌పై ఆసక్తి కలిగేలా చేశారు.

క్రికెటర్ త్రిష

త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి.. 2012లో హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ అకాడమీలో చేర్పించారు. కుమార్తె ఆట కోసం ఆయన కుటుంబంతో కలిసి సికింద్రాబాద్ షిఫ్ట్ అయ్యారు. భద్రాచలం నుంచి నగరానికి షిఫ్ట్ అయిన రెండేళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడింది. ఆ తర్వాతి ఏడాదే అండర్-19, అండర్-23లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది.

త్రిషకు మంత్రి కేటీఆర్ అభినందనలు

కొంత కాలం తర్వాత హైదరాబాద్ అండర్-19 విమెన్స్ కోచ్ నూషిన్ అల్ ఖాదీర్‌కు త్రిష గురించి ఆమె కోచ్‌లు చెప్పారు. త్రిష ఆటతీరు నచ్చడంతో.. ఆమె కూడా త్రిష కోసం సమయం కేటాయిచారు. కొంత కాలం తర్వాత భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా ఆ కోచింగ్ అకాడమీలో భాగమయ్యారు. ఇక త్రిష అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఎంపికై.. మెగా టోర్నీలో సత్తా చాటింది.

మొక్క నాటిన క్రికెటర్ త్రిష

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details