Swachh Survekshan Awards 2023 కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తున్న సంగతి తెలిసింది. ఈ సారి స్వచ్ఛ సర్వేక్షన్ 2023 అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షన్‌లో మరోసారి మన తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో ఫోర్‌స్టార్ రేటింగ్‌లో తొలి 3 స్థానాల్లో తెలంగాణ నిలిచింది.
మొదటి 3 స్థానాల్లో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు నిలిచాయి. త్రీ స్టార్ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి, రెండు స్థానాల్లో సిద్దిపేట, జగిత్యాల నిలవగా..టూ స్టార్ కేటగిరీలో జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి స్థానం కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.