తెలంగాణ

telangana

ETV Bharat / state

GURUKULAM: గురుకులాల సొసైటీల్లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో సగం సీట్లను స్థానిక పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

GURUKULAM
గురుకులాల సొసైటీ

By

Published : Jul 30, 2021, 8:00 AM IST

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2021-22 ఏడాది నుంచి సగం సీట్లను స్థానిక నియోజకవర్గాల పరిధిలోని పిల్లలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలలకోసారి జరిగే తల్లిదండ్రులు, విద్యార్థుల సంఘాల (పీటీఏ) సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై పాఠశాల పనితీరును సమీక్షించి, సూచనలు, సలహాలివ్వాలని కోరింది.

Gurukul entrance exam: 'గురుకుల ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం'

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 50 శాతం సీట్లను స్థానిక నియోజకవర్గాల విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. ఒకవేళ 50 శాతం సీట్లకు అనుగుణంగా స్థానిక నియోజకవర్గ విద్యార్థులు అందుబాటులో లేకుంటే ప్రవేశపరీక్షలో తదుపరి మెరిట్‌ విద్యార్థులకు రిజర్వేషన్ల మేరకు సీట్లు ఇస్తారు.

మన గురుకులాలు దేశానికే ఆదర్శం: కొప్పుల

ఈ నెలాఖరులోగా కళాశాలల్లో చేరాలి

తెలంగాణ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2021-22 ఏడాదికి ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 29 నుంచి కేటాయింపు పత్రాలు వెబ్‌సైట్‌ నుంచి తీసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ ఒక ప్రకటనలో కోరారు. ఈ నెలాఖరులోగా అవసరమైన పత్రాలతో ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: GURUKULS : గురుకులాల్లో నిలిచిన పోస్టుల భర్తీ

Koppula Eshwar: గురుకులాల విద్యార్థులు ఇబ్బందులు పడకూడదు

ABOUT THE AUTHOR

...view details