తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ

Telangana Letter to KRMB: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ పనులు కొనసాగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ

By

Published : Nov 1, 2022, 7:25 PM IST

Telangana Letter to KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు లేఖ రాసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డ్ ఇంకా అమల్లోకి రాక ముందే ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాలువ పనులు కొనసాగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో అనేక సార్లు లేఖలు రాసినప్పటికీ తగిన విధంగా స్పందించలేదని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్​కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ఇప్పుడు ఏకంగా డీపీఆర్​ను కేంద్ర జల సంఘానికి సమర్పించిందన్న తెలంగాణ.. ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు, కేసులు పరిష్కారం అయ్యే వరకు డీపీఆర్ పరిశీలన నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details