Telangana Letters to KRMB: రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు మరో లేఖ రాసింది. ఏపీలో ప్రాజెక్టులపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల్లేని ప్రాజెక్టులపై ఇప్పటికే 40 లేఖలు రాశామని.. అయినప్పటికీ కృష్ణాబోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఇప్పటికైనా కృష్ణా బోర్డు.. అనుమతులు లేని కొత్త ప్రాజెక్టులను ఆపాలని ఆ లేఖలో పేర్కొంది.
గతంలోనూ గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతుల్లేవని.. వాటి విస్తరణ పనులకు అనుమతి తగదని లేఖలో పేర్కొన్నారు.