తెలంగాణ

telangana

ETV Bharat / state

సాదాబైనామాలకు మరో అవకాశం - తెలంగాణలో భూముల క్రమబద్ధీకరణ

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

సాదాబైనామాలకు మరో అవకాశం
సాదాబైనామాలకు మరో అవకాశం

By

Published : Oct 13, 2020, 5:20 AM IST

సాదాబైనామాలకు మరో అవకాశం ఇచ్చింది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు చివరి అవకాశంగా వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీసేవ ద్వారా ఆన్ లైన్ విధానంలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తు చేసుకునేందుకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. 2014 జూన్​ 2నాటికి ముందు తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరిగిన వాటికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని... సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు 11.19 లక్షల దరఖాస్తులు రాగా... 6.18లక్షల దరఖాస్తులు పరిష్కరించింది.

ఇదీ చూడండి:'ఎవరూ డబ్బులు కట్టకండి... ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details