తెలంగాణ

telangana

ETV Bharat / state

బడ్జెట్‌పై కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు - telangana state budget news

బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. సీఎం కేసీఆర్​ మార్గనిర్దేశం మేరకు ఆదాయ, వ్యయ అంచనాల ఆధారంగా ఆర్థికశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

బడ్జెట్‌పై కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు
బడ్జెట్‌పై కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు

By

Published : Feb 10, 2021, 3:09 AM IST

రాష్ట్ర బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక స్థితిగతులు, నీటిపారుదల శాఖ, ఆర్టీసీ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంశాలపై సమీక్షించిన సీఎం... అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి సూచనల మేరకు... ఆదాయ, వ్యయ అంచనాల ఆధారంగా ఆర్థికశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అధికారులతో సమావేశమైన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ కసరత్తును సమీక్షించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర ఆదాయ అంచనాతో పాటు ప్రతిపాదనల తయారీపై చర్చించారు. నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై ఈఎన్​సీలు, సీఈలతో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ సమావేశమై చర్చించారు. ప్రాజెక్టుల నిర్వహణా వ్యయానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఇదీ చూడండి:బడ్జెట్​పై కసరత్తు... అదనపు ఆదాయావకాశాలపై దృష్టి

ABOUT THE AUTHOR

...view details